ముచ్చట్ల పిల్లలం. (బాల గేయం);-గుర్రాల. 9491387977.
అచ్చట్ల ముచ్చట్ల పిల్లలం
తప్పెట్లు కొట్టేటి మల్లెలం
బొబ్బట్లు చేసేటి వారలం
మా కొట్లో అమ్మేటి పోరలం!

క్రమశిక్షణకు పట్టుబట్టి
మాశ్రమనే తాకట్టు పెట్టి
సాగుతున్నాం ముందుకు
సంపాదించే మా సొమ్ముకు!

కుట్టు మిషన్లు పెట్టినం
బట్టలెన్నో మేం కుట్టినం
గొంగడిలో మూటకట్టినం
అంగడిలో కాలు పెట్టినం !

నాటకాలను మేం వేస్తుటం
నాటక డైలాగుల వ్రాస్తుంటం
సూటిగా మేకప్ చేసుకుంటం
సూటు బూటు వేసుకుంటం !

మా పనిలోని అర్థం పరమార్థం
కని విని మేం అందలి గూడార్థం
గుర్తిస్తాం మేం వెంటనే అర్తిస్తాం
 యజమానే దైవం అని భావిస్తాం!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

కామెంట్‌లు