వేమన కలానికి రెండు వైపులా పదును ఉంటుంది ఒకపక్క పిసినారి తత్వాన్ని చెప్పి మరో ప్రక్క దానశీలత గురించి చెబుతాడు. చిన్న పిల్లల ఆటలు చాలా సరదాగా ఉంటాయి. ఆనందంతో పాటు శాస్త్రీయ దృక్పథం కూడా ఉంటుంది. నది ఒడ్డుకు గానీ సముద్రపు ఒడ్డుకు గానీ వెళ్లి సరదాగా కాలక్షేపం చేస్తూ వేగంగా వచ్చే నీటి పైన ఉన్న అల ఎలా పడిపోతుంది మళ్ళీ ఎలా లేస్తుంది జీవితంలో పడ్డ వాడెవరు చెడ్డవాడు కాదు ప్రయత్నం చేస్తే ఏదైనా చేయవచ్చు అందులో మానవునికి అసాధ్యమైన పని ఏదీ కనిపించదు. ఈ పిల్లలు ఇసుక తిన్నెల మీద కూర్చొని మాట్లాడుతూ చిన్న చిన్న గోతులు తవ్వుతారు ఒక జానెడు పైగా ఇసుకను తొలగించిన తరువాత చిన్న ఊట ప్రారంభమవుతుంది ఆటగా ఆడుతూ దానిని తీసి ప్రక్కన పోస్తారు ఇంకా ఊరుతోంది ఈ కుర్రవాడు తీసిన కొలది అది ఊరుతూనే ఉంటుంది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కనుక ఒక పెద్ద ఆటగా ఉంటుంది చిన్నప్పుడు అందరికీ ఇది అనుభవమే.
కొంతమంది చేతుల్లో డబ్బు లేకపోయినా ఆకలితో అలమటించే వారి బాధలను చూసి వారి ఆకలి బాధలు తీర్చడం కోసం సాహసం చేసి ముందుకు వస్తారు. స్వార్థానికి కాకుండా సమాజ హితం కోసం మంచి చేసే వారికి దాతల సహకారం ఎప్పుడూ ఉంటుంది. వారు చేస్తున్న మంచి పనులను గమనించి, వస్తువుల రూపంలో కానీ, ధన రూపంలో కానీ సహకారం అందించడానికి ముందుకు వస్తారు. అతనికి ధనం ఎక్కడ నుంచి వస్తుంది ఇంతమందిని పోషించడానికి అని కొంతమంది విమర్శించవచ్చు
వేమన మహర్షి చెప్పినట్టు చలమ తీసిన కొద్దీ ఊరినట్లు దాతల సహకారం అలా వస్తూనే ఉంటుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి