కౌ మా రా వ స్థ "శంకర ప్రియ.,"సంచార వాణి: 99127 67098
 👌బరువు బాధ్యత లన్ని
     మోయును, "కౌమారము"
     విశ్రాంతి లేని స్థితి
           ఓ తెలుగు బాల!
          ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌"కౌమారము".. దేహము యొక్క దశలలో మూడవవది!
ఈ అవస్థ.. జీవితములో మధ్యవయస్సుగా పేర్కొన వచ్చును! ఈ దశలో.. స్త్రీ పురుషులు ఆలుమగ లౌతారు. వారిరువురు.. కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తారు.
👌ఈ దశలో.. వృత్తి, ఉద్యోగ, వ్యాపారము లందు నిమగ్నులై యుంటారు. క్షణం తీరిక లేకుండా వ్యవహరిస్తారు. యాంత్రిక జీవనం కొనసాగిస్తారు. తన కుటుంబము పురోభివృద్ధి కొరకు పాటుపడతారు. అట్లే, తమ సంతతి చదువు, సంస్కారముల కొరకు నిర్విరామముగా కృషి సల్పుతారు!
       ⚜️కందపద్యము⚜️
      బరువుల బాధ్యత లరయుచు
       సరినెన్నుచు మంచిచెడుల, సదమల రీతిన్;
       దరినెన్నుచు నడవవలయు
       అరయంగా మధ్య యీడునందిన జనముల్ !!
   ( రచన: డా. శాస్త్రుల రఘుపతి. )

కామెంట్‌లు