పువ్వు వికసించి పరిమళిస్తేనే
తుమ్మెద వాలుతుంది... !
గానీ... !
ఆడతనానికి వెర్రెత్తిపోయే మగ
పురుగు...వావి చూడదు,వరస
చూడదు ! చిన్నా - పెద్దా తేడా కనిపంచదు !!
. కామోన్మాదంతో కసుగాయల
లాంటి పసికందులనూ నలిపి నాశనం చేసేస్తుంది... !
అభం - శుభం తెలియని పసి
పిల్లలు...చాక్ లెట్లూ,బిస్కెట్ల కే
బలై పోతున్నారు !
... పశుత్వాన్ని మించిపోయిన పైశాచికత్వం,కాలేజీలకూఉద్యో
గాలకూవెళ్లేదారుల్లో మాటువేసి
పీక్కుతినే నక్కలూ, తోడేళ్ళూ, పులులూ స్వైర విహారంచేస్తున్న
ఈ సమాజంలో... ఆడతనం దిక్కుతోచక హడలిపోతోంది !
అన్యాయంఐపోయినఅబ
లలకు అండగా... నిలవాల్సిన హక్కులు అన్యాయాలకూ...
ఘోరనేరాలకూకొమ్ముకాయటం
తగినశాస్తి జరిగిందని సంతో షించక...దుర్మార్గాన్నిదండించిన
చట్టాన్నే తప్పుపడుతున్న.... న్యాయ స్థానం... !
రెచ్చిపోతోంది అరాచకం... !!
ఇదేనా...పరిణతి చెందిన సభ్య
సమాజం !?
ఇదా.... మానపురోగతికి పరా కాష్ఠ ?!
తల్లిదండ్రులారా... కేవలం కనటమేకాదు...పిల్లలనుబాధ్య
తతో పెంచండి !
విద్యావేత్తలారా...చదువులు
కేవలం ఉద్యోగాలకోసమే కాదు
నైతిక విలువలు బోధించండి!
చట్ట,న్యాయ పరి రక్షకులారా
జరిగినతప్పులు మళ్ళీజరగనం
తగా సత్వర కఠిన శిక్షలు విధిం చండి.... !
ఓ హక్కుల పోరాట నేతలారా
మీ కామెర్ల రోగాన్ని వదిలించు కొని...కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించండి... !!
ఈసమాజంలో....ఆడతనాన్ని
రక్షించండి.... !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి