ఆయన ధనవంతుడు. ఆయన దగ్గర అనేక గుర్రాలున్నాయి. వాటికి క్రమం తప్పక శిక్షణ ఇచ్చి వివిధ ప్రాంతాలలో జరిగే పందాలకు పంపిస్తుంటాడు. గుర్రాలకు శిక్షణ ఇవ్వడం కోసం ఆయన వద్ద ప్రత్యేకించి కొంతమంది ఉన్నారు. శిక్షకులకూ గుర్రాలకూ పౌష్ఠికాహారం ఇవ్వడంలో లోటు చేసేవాడు కాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో గుర్రాలు పరుగులెత్తించేవాడు.
గుర్రాలన్నింటిలో ఒకటి మహా గంభీరంగా ఉండేది. అది పోటీపడిన పందాలలో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచి బహుమతులు సాధించిపెడుతుండేది.
కనుక మిగిలిన గుర్రాలకన్నా ఈ గుర్రానికున్న విలువ వేరు.
ఓరోజు ఉదయం శిక్షకులు వచ్చి ఆ గుర్రానికి శిక్షణ ఇవ్వడం కోసం వచ్చారు. కానీ అది పడుకుంటూనే ఉంది. ఎంత ప్రయత్నించినా అది ఉన్న చోటు నుంచి కదలలేదు. దాంతో శిక్షకులు "పోనీ ఈ ఒక్కరోజేగా" అనుకుని దానిని విడిచిపెట్టి మిగిలిన వాటిని శిక్షణకు తోలుకుపోయారు.
అయితే మరుసటి రోజుకూడా ఆ గుర్రం మొండికేసింది. ఆ గుర్రంలో అహంకారం మొదలైంది. తానన్ని పోటీలలో మొదటి బహుమతి సంపాదించిపెడుతున్నది తనే కదా అనుకుంది.
దాని తీరుతో శిక్షకులు "సరేలే....ఈ గుర్రం ఎలాగూ గెలిచేస్తుంది" అనే నమ్మకంతో కొన్ని రోజులపాటు దాని జోలికి పోవడం మానేశారు.
ఓరోజు మిగిలిన గుర్రాలతోపాటు ఈ అహంకార గుర్రంకూడా పందెంలో పాల్గొనడానికి పోయింది.
కానీ పూర్వంలా అది వేగంగా పరుగెత్తలేకపోయింది. పందెంలో ఓడిపోయింది.
అందరికీ ఆశ్చర్యం వేసింది.
ఆ తర్వాత కూడా అనేక పందాలలో పాల్గొన్నప్పటికీ అది గెలవడమే మానేసింది.
రోజురోజుకూ దాని శక్తి క్షీణించడం మొదలైంది. దీంతో అన్నింటి మధ్యా దానికున్న విలువ తగ్గిపోయింది.
ఆ గుర్రాన్ని తిట్టుకోవడం మొదలుపెట్టారు.
వరుసపెట్టున అది పందాలలో ఓడిపోవడంతో యజమాని దానిని అమ్మెయ్యాలనుకున్నాడు.
ఈ విషయం తెలియడంతోనే ఆ గుర్రం ఏడుపు వచ్చింది.
తన పక్కనే ఉన్న గుర్రం "మిత్రమా, దిగులుపడకు" అని ఆ అహంకార గుర్రాన్ని ఓదార్చింది.
"నువ్వు రోజూ క్రమం తప్పక శిక్షణకు హాజరైనప్పుడు విజయం సాధిస్తూ వచ్చావు. ఉన్నట్టుండి శిక్షణకు రావడం మానేసావు. మొండికేశావు. బద్దకించావు. శిక్షణే మన చేతలకు అద్దం పడతుంది. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. నీ ఓటమికి కారణం శిక్షణ మానేయడమే. నిర్ణీతపద్ధతిలో శిక్షణలో పాల్గొంటూ దానిని ఆచరణలో పెడితేనే నలుగురూ ప్రశంసిస్తారు. పట్టించుకుంటారు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకో. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. పూర్వంలా నువ్వు శిక్షణలో పాల్గొంటూ ఉండు. బద్దకించకు.నువ్వు మళ్ళీ పోటీలలో నీదే పైచేయి అవుతుంది. నీ ప్రతిభను చూసి యజమాని మనసు మార్చుకుంటాడు. నిన్ను అమ్మకానికి పెట్టడు. నాతో శిక్షణకు రా" అంది ఆ గుర్రం.
అహంకారగుర్రానికి పరిస్థితి బోధపడింది.
"నువ్వు చెప్పింది నిజమే. శిక్షణ అనేది లేకుంటే విజయం అసాధ్యమని తెలిసొచ్చింది. నా తీరు తప్పే. ఇక రోజూ మీ అందరితోపాటు నేనూ వస్తాను" అంటూ ఆ గుర్రం శిక్షణకు బయలుదేరింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి