* ప్రకృతికాంత దరహాసం * ;-; కోరాడ నరసింహా రావు!
 నిర్మల వినీలాకాశంలో... 
     నిండుజాబిలి.... 
        పండువెన్నెలలు.... 
          కురిపిస్తుంటే...., 
పిల్ల తెమ్మెరల సంగీతానికి.... 
  పూలతీవెల నాట్యాలు !
    పరవసించిన, సన్నజాజి... 
      మల్లెలు... వెదజల్లెడి... 
         పరిమళాలు... !!
బాబుకు బువ్వను తినిపించగా
   రా రమ్మని చందమామను... 
       పిలుచు అమ్మ పాట... !
కొబ్బరిచెట్టు నీడలో..... 
   పూల పాన్పుపై.... 
       పడుచు జంట..... 
          సయ్యాటలు !
తీపితలపుల వేదనలో.... 
   ఎడబాసిన.... 
      ప్రేయసీ, ప్రియులు .... !
మిల - మిల  మెరుస్తూ.... 
   గల - గల పారే.... 
      సెలయేటిలో.... 
        హాయిగ సాగే... 
           నవదంపతులపడవను 
 వీడక,ముసి -ముసి నవ్వులతో
వెంటవచ్చు ఆ చంద్ర బింబం !
  ప్రశాంతసుందరసోయగాలతో 
ప్రకృతికాంత దరహాసం... !!
      *******

కామెంట్‌లు