పిలుపునిచ్చె బడియు పిల్లల రాజ్యమ్ము
దుమ్ము దులిపినారు దొరతనమ్ము
మూగబోయినబడి ముచ్చట్లు చెబుతుండె
హాసమొందినారె నయ్యవార్లు !
తుప్పు పట్టిగేటు తొందర పడుచుండె
పిచ్చిమొక్కలన్ని పోయెనిపుడు
జెండ నిలిచియుండె జాతీయ గీతమున్
రోజు వినగనింక రూపుమారు !
గంటగంట మ్రోగు ఘనమైన బడిగంట
సీత కోకలల్లె చిన్నవాళ్ళు
తోటలోని పూల తొందరల్ గనుమయ్య
పలుకువినిన గోడ పరవశించు !!
నల్లబోర్డు లిపుడు నాణ్యమై వెలుగొందె
చాకు పీసు కదలె చక్కగాను
పాఠములును నేర్వ పాపలు తపియింత్రు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి