జీవితంలో నిద్రాహార భయాదులు సహజము అంటాడు చిన్నయసూరి. మనం ఏ రకమైన పనులు చేసినా కావలసినది కడుపు నిండడం ఆకలి బాధను తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి వారిని ఆప్యాయంగా పిలిచి తనకున్న దానిలో కొంచెం పెడితే ఆ ప్రాణం ఎంతో సంతోషిస్తుంది జీవితాంతం మీకు రుణపడి ఉంటుంది. ఏ రకమైన దానాలు చేసినా అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చి పెద్దవాడిని చేసి జీవితంలో స్థిరపడాలనుకున్న తల్లిదండ్రులు నీకు ఆరాధ్యదైవాలు. వారు లేకపోతే నీకు జన్మ లేదు, పెరుగుదల లేదు నూతిలో కప్ప (కూపస్థ మండూకం) లా బ్రతక వలసినదే అందుకే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అంటారు. రక్తసంబంధం అయిన తల్లిదండ్రులను గౌరవించడం, పూజించడం మన ధర్మం మనకే సంబంధం లేకుండా ఎక్కడినుంచో వచ్చి బతకలేక బడిపంతులు అన్నట్టుగా తాను కడుపు నింపుకోవడం కోసం అక్షరజ్ఞానం ఇవ్వడానికి వచ్చిన వారిని మనం ఎంత గౌరవిస్తాం. చిన్నప్పుడు పాఠశాలలో చదివించిన గురువుగారు కనిపిస్తే భయభక్తులతో వారికి నమస్కారం చేస్తాం. అదే పెద్ద చదువులు చదివి పీహెచ్డీ చేయడానికి సహకరించిన మార్గదర్శిని చూస్తే మనతో పాటు వారిని కూడా బారుకు తీసుకెళ్ళతాము అదే అజ్ఞానాన్ని పోగొట్టడానికి బీజాక్షరం వేసిన గురువును భగవత్స్వరూపంగా గౌరవిస్తాం. విద్యార్థితో పాటు, ఆ గ్రామస్తులు, అతని తల్లిదండ్రులు కూడా ఆ గురువుగారు అంటే ఎంతో విలువనిస్తారు, వారు చెప్పిన ప్రతి మాటను వేదాక్షరంగా పాటిస్తారు.
అన్నదానం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి