రుబాయీలు ; -ఎం. వి. ఉమాదేవి
 21)
ఇష్టమైన కష్టమైన సాగాలిక బ్రతుకుపోరు 
అభివృద్ధియె సూత్రంగా మారాలిక బ్రతుకుపోరు 
ఆశలేని జీవితమే తొండగుడ్ల  బీడుభూమి 
పదునుతేలి పంటపండి తీరాలిక బ్రతుకుపోరు !!
22)
లోకంలో మంచితనం కొంచెమైన మిగిలివుంది 
నాకంలో నిలవాలని ధ్యేయమైన మిగిలివుంది 
లాభం లేనిది ఏపని చెయ్యలేని మనిషితనం 
కృత్రిమమౌ నమ్మికలో మోహమైన మిగిలివుంది !!

కామెంట్‌లు