కొంచెం భరోసా!..(బాలగేయం)---గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
కొంచెం భరోసా! మాకిస్తే!!
కొండలు పిండి చూపిస్తాం
చంద్రమండలం ఎక్కేస్తాం
జాబిలమ్మను  తెచ్చేస్తాం

నైతిక విలువలు నేర్పిస్తే !!
నీతి సూర్యులు మేమవుతాం
ఖ్యాతిని మేము గొనితెస్తాం
జాతి గౌరవం నిలబెడుతాం

ఉన్నత విద్యను అందిస్తే!!
ఉత్తమ పౌరులు మేమవుతాం
జగతిప్రగతిని పెంచేస్తాం
విశ్వశాంతిని పంచేస్తాం

కొంచెం భరోసా! మాకిస్తే!!
సాహస పనులే చేసేస్తాం
"కోహినూర్" వజ్రమవుతాం
అందరి మనసులు దోచేస్తాం


కామెంట్‌లు