అమ్మ నిలయం అమృతాలయం
అమ్మ పలుకు అమృతపు చినుకు
అమ్మహస్తం జీవననేస్తం
అమ్మచూపే మార్గదర్శనం
అమ్మ చోటే పూలతోట
అమ్మమాట బ్రతుకుబాట
అమ్మే తీయని అక్షరపూదోట
అమ్మంటే అమితానందం
అమ్మంటే పెనవేసే బంధం
అమ్మంటే జీవనది
అమ్మంటే సతతహరితం
నీవెలా ఉంటావో తెలియకపోయినా
నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది
నీవెలా ఉన్నావో తెలిసినా
నిన్ను కడుపులో పెట్టుకుంటుంది
నీ నోరు విప్పక పోయినా
అమ్మకు సమస్తం అర్థమవుతుంది
నీ కోసం తన ప్రాణమైనా ఇస్తుంది
అమ్మ ప్రాణమే నీవు కనుక !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి