మా ఊరి చెరువులోన
విరిశాయి కమలాలు
మా ఊరి చెరువులోన
విరిశాయి కలువలు
పగటిపూట కమలాలు
రాత్రిపూట కలువలు
రేకుల హృదయం
విప్పిన కమలములు
చూస్తాయీ సూర్యుని కోసం
విప్పిన హృదయపు
రేకులతోటీ కలువలు
చూస్తాయీ చంద్రుని కోసం
కమలాలరేడు సూర్యుడు
కలువలరేడు చంద్రుడు
కమలాలు కలువలు నీటనే
సూర్యుడు చంద్రుడు మింటనే
కమలాలు కలువలు ఇలకు అందాలు
సూర్యుడు చంద్రుడు ఇలకే వెలుగులు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి