సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 చురుగ్గా.. .మెరుగ్గా…
    ******
దేహాన్ని, మనసును ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచుకోవాలి. అలా సంసిద్ధం చేసుకున్నప్పుడే చేసే పని మెరుగ్గా ఉంటుంది.
అన్యమనస్కంగా, శారీరక సమస్యలతో చేసే పనుల్లో చురుకుదనం లేకపోవడం వల్ల అనేక తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది.
చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ సరిదిద్దుకుంటూ చేయాల్సి వస్తుంది.
కాబట్టి మనశ్శరీరాలను చురుగ్గా ఉంచుకోవడానికి ఒకటే మార్గం.వీలైనంత వరకు ఏ సమస్యనూ భూతద్దంలో చూడకుండా ఉండటం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు బెంబేలెత్తి ఆసుపత్రుల వెంట పరుగులు తీయకుండా ఇంట్లో పెద్ద వాళ్ళ చిట్కా వైద్యం పాటిస్తూ ఉండటం.
మానసిక ఉల్లాసం కోసం, మంచి ఆరోగ్యం కోసం నచ్చిన మంచి పనులు చేసేందుకు కొంతైనా సమయాన్ని కేటాయిస్తే చాలు చురుగ్గా మెరుగ్గా ఉంటాం.
అప్పుడే ఎదుటివారు ఆశ్చర్యపోయేలా,ఆరాధించేలా ఆదర్శంగా ఉండగలం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు