ఒక్కొక్కటి నీటిబొట‌్టు
జారనీక ఒడిసిపట‌్టు
ముందు తరముల కవ్వియే
నీటి వసతి కూర్చిపెట‌్టు!!
సకల ప్రాణులకు రక్ష
కాపాడుటే జనదీక్ష
నీరులేనినాడు జీవి
అనుభవించాలోయి శిక్ష!!
నీటిని నీవు కాపాడు
అవ్వి వుంటేనే కూడు
రైతుపంటతీయుటకును
కలకాలమూ చేదోడు!!
!!ఒక్కొక్క టి!!
మనిషి ప్రాణం నిలుపును
మనుగడకైతోడ్పడును
జలసంపద విశ్వంలో
ప్రకృతివరమైనిలిచేను!!
నీటివిలువను తెలుసుకో
పొదుపుగాను వాడుకో
లేకపోతె కన్నీరే
తెలిసినీవు మసలుకో!!
!!ఒక్కొక్కటి!!
*అన్నాడి జ్యోతి*✍️.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి