శివ చాలా సార్లు ఫెయిల్ అవటంతో తల్లి దిగులు పడుతోంది. పైగా పూజలు జపాలపేరుతో ప్రతి మంగళవారం మొహాన ఇంత కుంకం మెత్తి ఇంటికి రాగానే మళ్ళీ పూజలో మునిగేవాడు.ఓమాయగాడి వలలో పడ్డాడు. తొట్టిలోని ఇసుక పై నీరు పోయాలి.ఇసుక తడిఅవుతుంది.భక్తి పెరిగే కొద్దీ దైవానుగ్రహం తో ఇసుక అసలు తడికాదు అని చెప్పాడు.వాడికి ప్రతిమంగళవారం పదిరూపాయల దక్షిణ సమర్పిస్తాడు.ఆరోజు వెయ్యి నూటపదహార్లు సమర్పించుకుని ఇల్లు చేరాడు."నిమ్మ కాయను తలవద్ద పెట్టుకొని పడుకో" అన్నాడు. తల్లి పెట్టెలో దాచిన చిన్న గొలుసు అమ్మి ఆఖరి రోజు ఐదువేలు ఆమోసగాడికి అర్పించాడు.మంత్రగాడు నిమ్మ కాయ సగంకోసి మంత్రాలు చదువుతూ గాలిలో ఊపాడు. దాన్ని గట్టిగా వత్తాడు.అంతే! నిప్పురవ్వలు ఎగిసిపడినాయి.ఓతాయెత్తు కట్టాడు. పదిరోజుల తర్వాత సంవత్సరపరీక్షలు ఆరంభమైనాయి.పేపరులో ఒక్క ప్రశ్నకు జవాబు రావటంలేదు. అసలు మనసు పెట్టి చదివితేగదా?పూజ పేరుతో గంటల కొద్దీ గడిపాడు.
: గుడ్డిగా మాంత్రికుని నమ్మాడు.వాడు చేసిన ట్రిక్కులు తెలుసుకోలేదు. తొలి పరీక్ష పూర్తి కాగానే మాంత్రికుని వద్దకు పరుగెత్తాడు.వాడు ఎప్పుడో ఉడాయించాడు.ఈసారి కూడా ఫెయిల్ అయ్యాడు. ఆరోజు తన తమ్ముడు వస్తే తల్లి శివ చదువుని గూర్చి చెప్పి ఏడుస్తోంది. మామకి సంగతి అర్ధంఐంది. "శివా!గాలిలో దీపంపెట్టి దేవుడా నీమహిమ చూపు అనటంకాదురా!
ఆమంత్రగాడి వలలో పడి చదువు అటకెక్కించావు.వాడు చేసింది అంతా సైన్స్ ప్రయోగాలు. దేవుని పేరు తో మోసాలు! నిమ్మ కాయ డిప్పలో శుద్ధ సోడియం నింపాడు. అది గాల్లో తిప్పగానే రసాయనిక ప్రక్రియ జరిగి నిప్పురవ్వల్లా వచ్చాయి.ఇసుకను ఓడబ్బాలో పోసి బాగా వేడిచేశాడు.కొవ్వొత్తిని పొడిచేసి ఇసుకలో కలిపాడు.ఓఇసుక డబ్బా లో మామూలు ఇసుక రెండో డబ్బాలో కొవ్వొత్తి కలిపిన ఇసుక ఉంచాడు.కొవ్వొత్తి ఇసుకకి నీరు అంటదు.ఇలా నిన్ను మోసంచేశాడు.భక్తి పెరిగేకొద్ది ఇసుక తడికాదు అనేది మాయమాట!" శివ కి తన తప్పు తెలిసి బుద్ధి వచ్చింది. ఈసారి చదువు పై ధ్యాస పెట్టి చదివి మంచి మార్కులతో పాసైనాడు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి