విరి బాల;-గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి
ఎవరు నేర్పారమ్మా 
పసి పాపకు
ముసి ముసి నవ్వులే
రువ్వాలనీ

ఎవరు నేర్పారమ్మా
ఈ పక్షికీ
 ఆకాశ వీధిలో
హాయిగా ఎగరాలనీ

ఎవరు నేర్పారమ్మా 
ఈ  మొక్కకు
చక్కగా పై పైకే
ఎదగాలనీ

ఎవరు నేర్పారమ్మా
తుమ్మెదలకు
కమ్మనీ తేనేలే
త్రాగాలనీ

ఎవరు నేర్పారమ్మా
సాగరానికీ
  సంతోష తరగల
తేలి ఆడాలనీ

ఎవరు నేర్పారమ్మా
చిలుకమ్మకు
ముద్దు ముద్దుగా
మాటలాడాలనీ

ఎవరు నేర్పారమ్మా 
కోడి పుంజుకూ
పొద్దు పొడవక ముందే
మేలుకోవాలనీ

ఎవరు నేర్పారమ్మా
ఆ నదికీ
వడి వడిగాముందుకే 
నడవాలనీ

ఎవరు నేర్పారమ్మా
విరిబాలకూ
పరిమళాలే ఎపుడూ
విరజిమ్మాలనీ!

ఎవరు నేర్పారమ్మా
ఈ పిల్లికి
ఎలుకనే ఒడిసి 
పట్టాలనీ 
===========================

తెలుగు పరిశోధకులు  
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,  తిరుపతి. తేది:03-06-2022
సెల్: 9493235992.


కామెంట్‌లు