బెలూన్ మతలబ్! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఓగారడీవాడు రెండు బెలూన్లు తెచ్చాడు.శివాని పిల్చి ఓచిన్న సూదితో బెలూన్ ని గుచ్చమన్నాడు. అదికాస్తా ఫట్ మని పగిలింది.ఇంకో పిల్లని పిల్చి రెండో బెలూన్ ని సూదితో గుచ్చమన్నాడు. అది అస్సలు పగలలేదు.శివని పిల్చి ఓదస్తీ చేతికిచ్చి పట్టుకోమన్నాడు.వెలుగుతున్న  కొవ్వొత్తి దగ్గర పెట్టినా అది కాలి బూడిద గా మారలేదు. మండే దీపంని నోటిలో పెట్టుకున్నాడు.నోరు తెరవగానే  బైట కి పొగ వచ్చింది. బల్లపై ప్లేటు గ్లాసు చాకు పెట్టాడు.ఓసంచీలోంచి బియ్యం తీసుకుని ప్లేట్ లో పోసి ఆకుప్పపై చాకుని పెట్టాడు. కానీ అది మాటిమాటికీ కింద పడసాగింది.మళ్ళీ ఆబియ్యాన్ని గ్లాస్ లో పోసి  చాకుని గుచ్చి దాన్ని పట్టుకుని పైకి లాగగానే గ్లాసుకూడా పైకి లేచింది. ఇంకేముంది?శివా  ఆమోసగాడి వల్లో పడ్డాడు. శివా ని తనవెంట తీసుకుని పోయాడు. 9ఏళ్ళ శివ మాయంకావటంతో అమ్మా నాన్న ఖంగారు పడి పోలీస్ రిపోర్ట్  ఇచ్చారు. పేపర్లో వార్త వచ్చింది. ఈగారడీవాడు పిల్లల ని కిడ్నాప్ చేసి తన వెంటతీసుకుపోయి దొంగలు గా బిచ్చగాళ్లుగా మారుస్తాడు.అరబ్ దేశాల్లో పిల్లలని ఒంటెలకి కట్టి వాటిని పరుగెత్తిస్తారు.పాపం!ఆపసివారు భయంతో కెవ్ న కేకలు వేస్తూ ఏడుస్తుంటే  షేక్ లు పైశాచికంగా కేరింతలు కొడతారు. వారి మూత్రపిండాలు అమ్ముకునే ముఠాగాళ్లు వలలో పడతారు పిల్లలు. శివా ని తన ఇంటికి తీసుకుని వెళ్లి  షర్బత్తులో మత్తు మందు కలిపి తాగించాడు.ఎలాగైతేనేం  పోలీసులు శివాతోపాటు ఓ ఇద్దరు పిల్లలను కాపాడి వారి అమ్మా నాన్నలకు అప్పగించారు. ఆగారడీవాడి ట్రిక్కులు జిమ్మిక్కులు గుట్టు తెలుసుకుందాం! బెలూన్ కి సెలో టేప్ అంటించి అక్కడ సూదితో గుచ్చితే బెలూన్ పగలదు.ఇంకెక్కడన్నా గుచ్చితే ఠాప్ అంటుంది.దస్తీ పై ఇథైల్ ఆల్కహాల్ ని నీటితో కలిపి అంటిస్తే ఆల్కహాల్ మండి ఆవిరి ఏర్పడుతుంది. దస్తీ కాలదు.గ్లాస్ లో బియ్యం  బాగా దండిగా పోసి చాకు అడుగు దాకాపోనిచ్చి లేపితే గ్లాసు పైకి  లేస్తుంది. ఇలా ప్రమాదం కాని చిన్న ప్రయోగాలు చేయవచ్చు 🌷
కామెంట్‌లు