అమ్మవారి నగలు!..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆగుడి అమ్మవారికి శ్రావణ  నవరాత్రి పర్వదినాల్లో నగలు అలంకరిస్తారు. వాటిని ఎవరో దొంగిలించారు.మంత్రతంత్రాలతో దొంగల ఆచూకీ చెప్తాడని గుడిపూజారి జటాజూటధారి  పొడవాటి గడ్డమున్న తాంత్రికుని రప్పించాడు.అతని నాలుక చివర ఓపొడవాటి దబ్బనం గుచ్చుకుని ఉన్నాడు.ఓ మామూలు కాగితం ని నేలపై పెట్టి కాసేపు ధ్యానం చేశాడు. ఆపై కొవ్వొత్తి సెగ చూపగానే "ర..అనే అక్షరం  దానిపై ప్రత్యక్షమైంది.ఆగుడి కాపలావాడు ఇద్దరు చిల్లర దొంగలు ధర్మకర్త కి గిట్టని వ్యక్తుల పేర్లు ర తో మొదలౌతాయి.ఆనలుగురుని తాంత్రికుడు అక్కడ చెట్టుకింద ఉన్న  గట్టుపై నాల్గుమూలలా  కూచోపెట్టాడు.వారిచేతులు ఒంటినిండా  విభూది పట్టించాడు.కమండలంలోని నాల్గు గవ్వలు తీసి వారి దగ్గర పెట్టి తన దగ్గర ఉన్న పాత్రలోని నీరు ఆగవ్వలపై చల్లాడు.విచిత్రం!?అతని చేతికి  తడే లేదు. మూడు మూలలా ఉండే వారి గవ్వలు స్థిరంగా ఉన్నాయి.కానీ రత్తయ్య గవ్వ నెమ్మదిగా కదులుతోంది. ఇంకేముంది? వాడే దొంగ అని నిర్ధారించారు. చెట్టుకి కట్టేసి చితకబాది రాత్రి  అక్కడే ఉంచారు. వాడి ఇల్లు  సోదాచేస్తే ఏమీ దొరకలేదు.  రత్తయ్య సోయిలేకుండా పడున్నాడు.దిక్కు దివాణంలేని ఇల్లు వాకిలి నాఅనేవారు లేని నిర్భాగ్యుడు! ఇల్లు అంటే ఆగుడి ప్రాంగణం లోనే తాటాకుల కొంప! తెల్లారి లేచి చూస్తే రత్తయ్య మాయం! రక్తపు మరకల చొక్కా అక్కడ పడుంది.ఇది జరిగిన ఆరునెలలకి రత్తయ్య ని పట్టుకుని పోలీసులు వచ్చారు.పూజారి తాంత్రికుడిని బేడీలతో  బంధించారు.అసలు విషయం ఏమంటే పూజారి  తాంత్రికుడు  నగలు కాజేసే ఎత్తు వేశారు. రత్తయ్య ని  బలిపశువుని చేశారు. తాంత్రికుడు నగలు అమ్ముతుంటే పట్టుబడ్డాడు.రత్తయ్య ని తనతో తీసుకుని వాడు పట్టణం ఉడాయించాడు. ఎందుకంటే  వెర్రిఅమాయకపు వాడు ఆఊళ్లో ఉంటే పూజారి గుట్టు బైట పడుతుంది కదా? ఇక తాంత్రికుడు చేసిన మాజిక్ఇది!వాడి నాలుక చివర దబ్బనంకి మధ్యలో  కొక్కెం ఉంటుంది. అదిదూరంగా  కనపడదు.నాలుక రంధ్రం లోంచి గుచ్చుకుని ఉన్నాడు అనే భ్రమ కలుగుతుంది. కాగితం పై  నిమ్మ రసం పూసి ర..అనే అక్షరం రాసి ఎండబెట్టాడు. నిప్పు సెగకి ఆ అక్షరం  కనపడింది. జింక్ స్టియరెట్ అనే పదార్థం  రసాయనిక చర్య వల్ల చేతిపై నీరు  కనపడదు.చేయి పెట్టినా నీటిలో తడవదు.సిట్రిక్ యాసిడ్ పౌడర్ని గట్టు నాల్గు మూలలా చల్లాడు.గవ్వలు కాల్షియం కార్బొనేట్ కావటంతో కేవలం రంగయ్య గవ్వమాత్రమే తాంత్రికుడు చల్లిన నీటితో రసాయనిక చర్యజరిగి కదిలింది. మిగతా ముగ్గురు తోడుదొంగలు! ఇలా సైన్స్ ని ఆధారంచేసుకుని  తాంత్రికుడు మంత్రాలు చదువుతూ  బురిడీ కొట్టిస్తాడు. అభాగ్యులు మోసపోతారు🌹
కామెంట్‌లు