మోడర్న్ థియేటర్స్ వారి నిర్మాణంలో ;రూపుదిద్దుకున్న "అలీబాబా నార్పదు తిరుడర్గళుం" సినిమానే తమిళంలో తొలి వర్ణ చిత్రంగా అనుకుంటారు. కానీ ఇది సరికాదని కొందరి వాదన.
1931మొదలుకుని 1938 వరఠూ తమిళంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్లో రూపొందినవే. అయితే 1938లో ఓ వర్ణచిత్రం తమిళంలో విడుదలైంది. దాని పేరు ధర్మపురి రగసియం ( లేదా రాజద్రోహి )
ట్రూ కలర్ అని చెప్పబడే sepia కలర్లో ఈ సినిమా విడుదలైంది. సినిమా ప్రపకటనలోనే సహజసిద్ధమైన వర్ణ దృశ్యాలతో కూడిన తొలి తమిళ సినిమా అనే మాటను ప్రచారం చేసారు.
అంటే అప్పటి వరకూ బ్లాక్ అండ్ వైట్లో సినిమాలొచ్చేవి. అయితే ధర్మపురి రగసియం (రాజద్రోహి) సినిమా నలుపు వర్ణంలో కాకుండా బ్రౌన్ కలర్లో నిర్మించారు.
ఈ సినిమా తర్వాత "అలీబాబా నార్పదు తిరుడర్గళుం" వర్ణ చిత్రమై విడుదలైంది. అనంతరం టెక్నాలజీ కలర్, ఈస్ట్ మన్ కలర్ అంటూ నెమ్మది నెమ్మదిగా పూర్తిస్థాయిలో కలర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
1930లలో పౌరాణిక, చారిత్రక కథలను ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రాలు విడుదలవుతుండగా తమిళంలో బ్లాక్ అండ్ వైట్ కు భిన్నంగా sepia కలర్లో మొట్టమొదటి వర్ణ చిత్రంగా ధర్మపురి రగసియం సామాజిక అంశంతో రూపొంది చరిత్రపుటలకెక్కింది. ఈ సినిమాలో మోటర్ బైక్, రివాల్వర్ వంటివి చూపడాన్ని అప్పట్లో అభిమానులు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు.
తమిళనాడు టాకీస్ తరఫున ఎస్. సౌందరరాజన్ ఈ సినిమాను నిర్మించడమే కాక దర్శకత్వంకూడా చేపట్టారు.
తిరువాంకూర్ సంస్థానానికి దివానుగా ఉండిన సి.పి. రామసామి అయ్యర్ జీవితంలో సంభవించిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు.
జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీలతో ప్రత్యక్ష పరిచయాలున్న రామసామి అయ్యర్ గొప్ప న్యాయవాదికూడా. తిరువాంకూర్ సంస్థానంవారి హయాంలో విద్య తదితర రంగాలలో ఆధునికతకు బీజం వేసిన వారిలో రామసామి అయ్యర్ పాత్రకూడా ఉంది.
అయితే ఆదే సమయంలో అవినీతి ఆరోపణలు భగ్గుమనడం సహజమే కదా. ఆ కోణంలోనూ కొన్ని సన్నివేశాలను ఈ సినిమాలో చిత్రీకరించారు. తమ దివాను గురించి నిజాయితీగా చూపించి ఉంటే తిరువాంకూర్ సంస్థానం ఈ సినిమాను కొనియాడి ఉండేది. కానీ ఈ సినిమాలో భిన్నమైన సన్నివేశాలుండటం వల్ల తమ ప్రాంతంలో ఈ సినిమా విడుదల కాకుండా నిషేధం విధించారు. అయితే మిగిలిన ప్రాంతాలలో ఈ సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడింది. కొన్నిచోట్ల పదిహేను వారాలు ప్రదర్శించారు.
అన్నాజీరావు అనే ఆయన దివానుగా నటించారు.
కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాలలోని టెంట్ హౌస్ లలో ఈ సినిమా ప్రదర్శన కొనసాగింది.
దివాన్ సి.పి. రామసామి అయ్యర్ గుట్టుచప్పుడు కాకుండా వేరొక ప్రాంతానికి వెళ్ళి ఈ సినిమా చూసారని అప్పట్లో చెప్పుకునేవారు.
తిరువాంకూర్ సంస్థానంలోని వారు తిరునల్వేలికి, కన్యాకుమారికి వచ్చి ఈ సినిమాను చూశారు.
ఈ ట్రూ కలర్లో సినిమాలు చూడటం తొలి రోజుల్లో బాగానే ఉన్నప్పటికీ రెండు మూడు వర్ణాలతో తీసిన సినిమాలకు మరింత ఆదరణ పెరిగింది.
ఎన్టీ రామారావు, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించిన కళ్యాణం పన్నిప్పార్ (1952) సినిమాకు ఎల్వీ. ప్రసాద్ తమిళంలో తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఇందులో కొన్ని సన్నివేశాలను వర్ణాలలో చిత్రీకరించారు.
అనంతరం 1956లో విడుదలైన "అలీబాబా నార్పదు తిరుడర్గళుం" సినిమా తొలి వర్ణచిత్రంగా తమిళంలో రికార్డు పుటలకెక్కింది. టి. ఆర్. సుందరం దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాలో ఎంజిఆర్, భానుమతి ప్రధాన తారాగణం. ఈ సినిమాకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు. అలీబాబాగా ఎంజిఆర్ కి పన్నెండు వేల అయిదు వందల రూపాయలు ఇచ్చారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి