ఎన్నెన్ని పనులో.....
ఆకలి దప్పిక అసలే ఉండదు.
దూరం భారం తెలియనే తెలియదు
ఎండాకాలం సెలవల్లో
. ఎన్నెన్ని పనులో......
ఈతగెలలు కోసుకొచ్చి
ఇంటి ముందు గొయ్యి తీసి
ఊక పోసి గెలలు పెట్టి
గడ్డికప్పి మట్టిపోసి
కప్పిపెట్టి పండినంక
దులిపి తింటుంటే......
ఆ రుచే వేరు ,ఆ తీపే వేరు
తిన్నవారి కెరుక,
తినని వారికేమెరుక
ఈత పళ్ళ మాధుర్యం.
ఎండాకాలం సెలవల్లో....
ఎన్నెన్ని పనులో.....
ఆకలి దప్పిక అసలే ఉండదు.
దూరం భారం తెలియనే తెలియదు
ఎండాకాలం సెలవల్లో
. ఎన్నెన్ని పనులో......
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి