రాళ్ళు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి
మేఘాల పూలు పూసి
ఆకాశం కాయలు కాసేంతవరకు
సముద్రం మధ్యలోనే
మునిగి తేలుతూ ఉంటాయి!!?
భూమి బాగా పండిన పండు అయితే
చిలుక కొరుకుతుంది
పుచ్చిన పండ్లు అయితే
పురుగు పాకుతుంది
చిటారు కొమ్మన మిఠాయి పొట్లమయితే
కొండచిలువ చుట్టుకుంటుంది!!
సముద్రాన్ని మింగి నిద్రపోతున్న పెద్ద పాము
రేపటికల్లా సూర్య చంద్రుల చుట్టుపక్కలకు పాకుతుంది
అప్పటికీ పొద్దు మూకుతుందీ
మళ్లీ తెల్లారదు!!?
పురాతన కోటలో దాచిపెట్టిన చరిత్ర
పట్టపగలు బట్టబయలు చేస్తే
పగలు ప్రతీకారాలు పట్టపు రాణుల కన్నీళ్లు
అట్టడుగు పునాదుల్లో సమాధి చేసినట్లు
మహళ్ళు మందిరాలు అన్ని
హృదయపు రక్తపు మరకల చిత్ర పటాలు అని తేలుతుంది!!?
ఇప్పుడు కాలకూట విషం పాములు తయారు చేయడం మానేసినవీ
ఇప్పుడు ఆసాములు భూస్వాములు స్వాముల దగ్గర విషపు కోరల్ని
మొలిపించుకుంటున్నారు!!?
విషం కాటే యదు వినిపిస్తుంది కనిపిస్తుంది
నిన్ను కాపలా కాస్తుంది మీ వెంటే ఉంటుంది
శరీరమంతా పచ్చగా పాకుతుంది!!?
తెలుపంటే అశ్వమనీ నలుపంటే విశ్వ మని
విశ్వసించిన నిన్ను
ఎరుపు ఎప్పుడో మింగేసింది
అది ఇప్పుడిప్పుడే కుబుసం విడిచింది!!?
ఆశయం కోసం కాషాయం తో స్నేహం చేసి
నిరాశతో నేటిని రేపటిని
కాటికాపరి కీ అప్పజెప్పిన
శవానివీ నీవే శివుడివీ నీవే!!
మట్టిలోంచి కట్టెను తయారు చేసినట్లు
అదియే మట్టిలోంచి
ఉక్కు దారాల్ని వొడుకుతున్న రాట్నం
రేపటి మనిషి కట్టుకునే బట్టలు కావాలి!!?
వేటాడటం అంటే మృగంలా
పచ్చి నెత్తురు పచ్చి మాంసం చప్పరించడమే కాదు
పది యుగాలు దాటి మనిషిలా మారటం
అది చేతనైతే
చిరుత కూడా నీ చెప్పు చేతల్లోనే పరిగెడుతుంది
ఆకలిగొంటుందీ ఆకలి తీర్చుకుంటుంది!!?
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి