సీతాకోకచిలుక (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
సీతాకోక చిలుకమ్మా 
అందం అంటే నీదమ్మా 
గాలిలో తేలుతు ఉంటావు 
అందాలను చిందిస్తావు 
పూలమీద వాలుతావు 
మధువులన్ని గ్రోలుతావు 
ఎక్కడి నుండి వస్తున్నావొ 
నీపయనం ఎక్కడికో 
నీ జాడంతా చెప్పమ్మా 
నీకోసం నే చూస్తానమ్మా 
రంగురంగుల ఓ చిలుకా 
నీ రెక్కలపైన ముచ్చటైన 
డిజైన్లనెవరు వేసిరో చెప్పమ్మా
ముద్దు ముద్దుగా ఉన్నావమ్మా
సీతాకోక చిలుకమ్మా
అందం అంటే నీదమ్మా !!



కామెంట్‌లు