తల్లిదండ్రుల దినోత్సవం శుభాకాంక్షలు అందిస్తూ
====================================
1.ఉత్సవాలు వద్దు!
అమ్మని అమ్మలా!
నాన్నని నాన్నలా చూడు!
జీవితంలో వెనుదిరిగి చూడు!
నీవున్న ఈనేడు, తాము,
తినడం మాని పెట్టిన కూడే!
2.నీవు శ్రావణ కుమారుడు,
కానక్కరలేదు!
సర్వోత్తమ ఉదాహరణై,
నిలవనక్కర్లేదు!
శాపానికి మారుగా,
పుట్టనివాడవైతే అది చాలు!
నీవు కూడా నాన్న/అమ్మ,
మీ నాన్నఆమ్మల యెడ,
మీ ప్రవర్తన తీరు!
మీ పిల్లల, కళ్ళసి.సి.కెమారాలు.
రికార్డ్ చేసి తీరుతాయి!
3.వృద్ధ ఆశ్రమమా!
నీ ఇంట ఆశ్రయం!
పంచభక్ష్య పరమాన్నాలా!
కాసిన్ని పలకరింపులు!
అవే బతుకు విస్తరింపులు!
4.ఇన్నేళ్ళు ఉన్నవాళ్లు,
ఇక ఎన్నేళ్ళు ఉంటారు?
ఉండే ఆ కొన్నాళ్ళు,
ఆనవాళ్ళు కావాలి!
జీవనచక్రంలో ఇది,
వాళ్ళ నేటి స్థితి!
సహజం రేపు,
నీది ఇదే పరిస్థితి!
ఈ మాత్రం వివేకం,
నీకు ఉత్తమగతి!
_________
ఆశ్ర(మం)యం!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి