విరుచుకుపడుతున్నది @కోరాడ నరసింహా రావు

 ఉత్తుంగ తరంగ శోభిత సాగరం 
        సప్తరూపములు దాల్చి...,
ఖండ,ఖండాoతరములుగా....      
ఈభూమినివిభజించి...        అందమైనద్వీపములు - ద్వీప కల్పములై... అలరారుటకు  ఆలంబనయై...నిలిచినదీ....   ..సాగరం . ! 
   జలచరములసామ్రాజ్యమ్మిది 
దేశ - విదేశముల గలుపు మార్గ మిది... !
  అంతులేని సంపదలనిక్షేపమ్మి ది...,అనలమునూ  కడుపున దాచుకున్నది !
     అమృతమును - హాలాహల మును  ఇది ఇచ్చినది !
   అంతుచిక్కని లోతు  తనది!!
   తాపసిలా ఉన్న తనను.... 
            కాలుష్యాలతో కలవర పెడితే...ఉప్పెనయై విరుచుకు పడుతున్నది.... !!
కామెంట్‌లు