నాకు ఆడపిల్లపుట్టింది(ఓ నాన్న స్వగతం)-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నేడునాకు
పుట్టింది ఆడపిల్ల
నాకు
నచ్చింది మనసెల్ల

మాఇంటికి
వచ్చింది
మహలక్ష్మి
మన్నించి

శుక్రవారాన
పుట్టింది
సంపదను
తెస్తుంది

ఆడపిల్లంటే
ఆదిలక్ష్మంటారు
అడుగుపెట్టిందంటే
అన్నికలిసొస్తుందంటారు

ఎరుపురంగులోన
వెలిగిపోతున్నాది
ఎత్తుకోమని నాకు
ఏదోచెప్పినట్లున్నాది

పెంచుతాను నేను
పోషిస్తాను నేను
పెద్దగాచదివిస్తాను నేను
పెళ్ళిచేస్తాను నేను

భార్య
కూతురునుచూచింది
పురిటిబాధలను
మరచిపోయింది

నానొచ్చి
చూచాడు
అమ్మమరలా
ఇంటికొచ్చిందన్నాడు

అమ్మొచ్చి
చూచింది
అతిగ
సంతసించిపోయింది

అక్కొచ్చి
చూచింది
కొడుక్కి
చేసుకుంటానంది

మామొచ్చి
చూశాడు
మహదానందంలోన
మునిగిపోయీనాడు

మరదలొచ్చి
చూచింది
మయిమరచి
మురిసిపోయింది

ఎవరు
అంటున్నారు
ఆడపిల్లలు
వద్దనిపుడు

మహిళలే
ముందువరసనున్నారిపుడు
పోటీపడి
పరదేశాలకెళ్ళుతున్నారిపుడు

ఉన్నతపదవులలోన
వర్ధిల్లుతున్నారు
విజయాలబాటలోన
ముందుకెళుతున్నారు

అబ్బాయిలెంతో
అమ్మాయిలంతే
మారింది కాలము
మనమూ మారదాం

లింగవివ

క్షలు
లేవిపుడు
భ్రూణహత్యలు
లేవిపుడు

మంచికాలం
వచ్చింది
సమానత్వం
తెచ్చింది

కామెంట్‌లు