సహృదయం;-----సుమ
 
మనిషికి సహృదయమే  సర్వరక్షణ కవచం !
జన్మతః ఎవరూ ఎవరికీ 
శత్రువు కాలేరు మిత్రుడు కాలేరు ... 
ఏవో కారణాలతో మనుషుల నడుమ 
వైరాలు స్నేహాలు ఏర్పడతాయి !
రాగద్వేషాల కారణాలు అన్వేషించి 
వాటిని పరిష్కరించుకోవాలి !
సహృదయం విచ్చుకుంటే 
అపార్థాలు దూరం అవుతాయి !
బతికినంతకాలం ఆనందాన్ని 
అమృతంలా తాగడం మనిషి కర్తవ్యం!
 .

కామెంట్‌లు