కర్మ ఫలం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 కౌరవ పాండవుల కథ తెలియని వారు అరుదు. జీవితంలో ధర్మాన్ని ఆచరించడం తప్ప మరొకటి తెలియనివాడు, పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. అతను ఏది మాట్లాడినా ధర్మ సమ్మతమే  రాజనీతి సమగ్రంగా తెలిసిన వాడు అందుకే  పాచికలాట తప్పని తెలిసినా విరోధి వర్గం అడిగినప్పుడు  రాకపోవడం తప్పని ఆయనకు తెలుసు.  కనుకనే తమ్ముళ్లు అందరూ వ్యతిరేకించినా తాను తన మాటకు కట్టుబడి  ఆడి ఓడిపోయి  చివరకు కట్టుకున్న భార్య ద్రౌపదిని కూడా కుదువ పెట్టి మాట నిలుపుకున్న వాడు  ప్రతివాడు చేసిన పనిని గురించి మనం మాట్లాడుకోము  అన్నీ తెలిసి శాస్త్రాలను తన గుప్పెట్లో పెట్టుకున్న మహానుభావులు  అలా చేసినప్పుడు మనం అనుకుంటాం పూర్వజన్మలో వారు చేసిన కర్మ వల్ల ఈ  ఫలితం అనుభవించవల్సి వచ్చింది అనే కదా. అన్న మాట ప్రకారం  పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. అజ్ఞాతవాసంలో తనకు ఎందుకూ తులతూగలేని విరాటరాజు కొలువులో  కంకుభట్టు అన్న పేరుతో  రాజుకు సలహాలు ఇస్తూ  కాలం గడపాల్సి వచ్చింది. కనుక దీనిని నివారించడానికి  సంచిత జన్మ ఫలం అని కాక మరొకటి ఏమనుకుంటాము. వేమన కూడా దానిని నిర్ధారిస్తాడు. 


కామెంట్‌లు