పదవి... పెదవి
******
ఎంత గొప్నదైనా పెద్దదైనా, అత్యున్నత స్థాయదైనా పదవి రాణించేది పెదవిని బట్టే.
ఆయా వ్యక్తులను పదవులను బట్టి గౌరవించడం తప్పని సరి పరిస్థితి కావచ్చు. కానీ లోలోపల మాత్రం పెదవులపై జాలువారే మాటలను బట్టే వారి పట్ల గౌరవం, అభిమానం కలుగుతాయన్నది అక్షర సత్యం.
విరిసీ విరియని చిరునవ్వు, స్థాయిని బట్టి కాకుండా సాటి మనిషిగా తాము ఇచ్చే మర్యాదే... ఎవరికైనా భూషణమై శోభిస్తుంది.
గాంధీజీ,భగత్ సింగ్,అబ్దుల్ కలామ్ గారి లాంటి వారు ఎందరో ఇందుకు గొప్ప ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
పదవికీ -పెదవికి మధ్య ఉన్న మానవీయ కోణం తెలుసుకుందాం. అభిమానులనైనా,శత్రువులనైనా పెంచేది వాటి సమన్వయమేనని గ్రహించి , ఎదుటి వారి మనసులో మనదైన వ్యక్తిత్వ ముద్ర వేసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి