అక్షర సూత్రాలు ;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 తప్పొప్పుల లెక్కలను పసిగట్టగల హృదయపు నేత్రాలు... 
అక్షర సూత్రాలు చేజారిన అవకాశాల అసంతృప్తి జ్వాలల 
అగ్నిహోత్రాలు...అక్షర సూత్రాలు
కాగితాల పొరలపై చెక్కిన మనసైన మాటల గోత్రాలు...
అక్షర సూత్రాలు 
తిరుగుబాటు ఉద్యమాల వీర  చరితల సజీవ సాక్ష్యాలు... అక్షర సూత్రాలు
చీకటి రేఖలను తప్పించిన మలిదారి మార్గాలు...అక్షర సూత్రాలు 
ఆకుపచ్చని అందాల పైన పల్లవించిన భావాల రాగాలు...అక్షర సూత్రాలు
వావి వరసలు మరచిన వర్తమాన వాస్తవిక వైనాలు... అక్షర సూత్రాలు
నిశ్శబ్దపు పొరల వెనక నిశిద్ధమైన కనిపించని కోణాలు...
అక్షర సూత్రాలు


కామెంట్‌లు