ఏమోయ్ అంటూ ఇంట్లోకి వచ్చాడు రవి.
ఏమిటండీ హడావిడి అంటూ వచ్చి మంచి నీళ్ల గ్లాసు అందించింది సుజాత, రవి భార్య.
ఏమిటండి రాత్రి 8 గం అయినా ఇల్లు గుర్తుకు రాదే , ఇవాళ అప్పుడే వచ్చారు ఇంత తొందరగా అంది సుజాత. ఆఫీస్ లో నన్ను పనిమీద మద్రాస్ కు వెళ్లామన్నారు . నేను మరొకరు ఇద్దరం వెళ్ళాలి. అదికూడా ఇవాళే బయలుదేరాలి. 10 గం కు ట్రైన్, అన్నాడు రవి టైం చూసుకుంటూ. అయినా ఇంకా నాలుగేళ్లలో రిటైర్ అవుతారు . ఇంకా ఆఫీస్ పనిమీద ఈ ప్రయాణాలేమిటండీ అంది సుజాత. రిటైర్ అయ్యే రోజు కూడా వెళ్లాల్సివస్తే వెళ్ళాలి , ఆఫీస్ పని అంతే అన్నాడు రవి.
ఎం ఆఫీస్ పనులోఏమిటో , అంతా హడావిడే కదా . ఒక్కసారయినా స్థిమితంగా ప్రయాణాలు చెయ్యరు కదా , ఎప్పుడూ హడావిడి అనుకుంటూ బట్టలు సర్దసాగింది. రవి మటుకూ తన ఆఫీస్ ఫైల్ చూసుకోవడం మొదలుపెట్టాడు.
ఏమండి భోజనానికి వస్తారా టైం 8 గం అవుతోంది, 10 గం కు ట్రైన్ అన్నారు అంది సుజాత. ఇదుగో వస్తున్నా అన్నాడు రవి ఫైల్ చూసుకుంటూ.
అంజలి ఆ ఫైల్ పట్టుకు రామ్మా అన్నాడు చిన్న కూతురు ను ఉద్దేశించి. అంజలి చిన్నకూతురు, ఇంగినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. అరుణ పెద్ద కూతురు. అరుణకు పెళ్లి చేసేసాడు. ఇక అంజలి పెళ్లి మిగిలింది. ఆ కాస్త పూర్తయితే తన బాధ్యత పూర్తవుతుంది .
నేను తిరిగి రావడానికి రెండు రోజులు పడుతుంది , డబ్బు ఎమన్నా ఇవ్వమంటావా ..అడిగాడు సుజాతను. ఉన్నాయి లెండి అంత అవసరం లేదు అంది సుజాత.
మరి బయలుదేరణా, అన్నాడు సుజాత ను ఉద్దేశించి. రవికి ,. అలాగేనండి జాగ్రత్త , వేసుకోవలసిన టాబ్లెట్స్ అవీ పెట్టుకున్నారు గా అంది గుర్తుచేస్తూ. పెట్టుకున్నలే అన్నాడు హడావిడిగా.
బయటకు వచ్చి చూస్తే ఒక్క ఆటో కూడా కనబడటం లేదు. టైం చూసుకున్నాడు 9 .10 గం అయింది . ఫరవాలేదులే చాలా టైం ఉంది అనుకున్నాడు.
ఇంతలో అటుగా ఎదో ఆటో వస్తుంటే పిలిచాడు, రైల్వే స్టేషన్ కు మాటాడి బయలుదేరాడు. రైల్వే స్టేషన్ కు చేరాడు. నెమ్మదిగా ఆటోలోంచి సూటుకేసు ను దించి ఆటో అబ్బాయికి డబ్బులిచ్చి , బయలుదేరాడు. సూటుకేసి కొంచం బరువు అనిపించింది. రెండు రోజుల ప్రయాణానికి ఎన్ని బట్టలు పెట్టిందో ఏమో అనుకుంటూ అడుగులు ముందుకు వేసాడు .
ట్రైన్ వస్తున్నా సంగతి ఇంకా అనౌన్స్ చేసినట్లు లేదు. అయినా ప్లాట్ఫారం నెంబర్ చూపించే ఎలక్ట్రానిక్ డిస్ప్లే వంక చూసాడు ఎక్కడా తాను వెళ్ళాసిన ట్రైన్ నెంబర్ కనబడటం లేదు. సరే డిస్ప్లే బోర్డు లో అనౌన్స్ చేసే వరకు ఈ ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీదే కాలక్షేపం చేద్దాం అనుకుంటూ అక్కడున్న స్టీల్ చైర్స్ విసిటింగ్ చైర్స్లో కూర్చున్నాడు.
తన కొలీగ్ కూడా అదే ట్రైన్ కు వస్తున్నాడు , కానీ అతనికి వేరే బోగీ వచ్చింది. లేట్ గా రిజర్వేషన్ చేయించాడు, AC బోగీలో సీట్ దొరకలేదు. పదినిముషాలు అయ్యాక తనదగ్గర్నించే ఫోన్ వచ్చింది.
ఏంటి రవి గారు ఎక్కడున్నారు అడిగాడు గోపాల్ అటునుంచి.
స్టేషన్ లోనే ఉన్నానండి చెప్పాడు రవి.
నేను ఆల్రెడీ ట్రైన్ లో ఉన్నాను సార్ , మీరెక్కడ ఉన్నారు అడిగాడు గోపాల్.
నేను ప్లాట్ఫారం ఒకటి మీద ఉన్నాను, ఇంకా ట్రైన్ ప్లాట్ఫారం అనౌన్స్ చెయ్యలేదని వెయిట్ చేస్తున్న చెప్పాడు రవి.
మనకిచ్చిన బోగీ గుడివాడ ట్రైన్ బోగీలలో ఉంటుంది. గుడివాడ ట్రైన్ బోగీలు మద్రాస్ ట్రైన్ తో అటాచ్ చేస్తాడు, చేసాడు కూడా. ప్లాట్ఫారం ఆరు మీద ఉంది మీరు త్వరగా రండి సార్ చెప్పాడు గోపాల్ ఖంగారు గా .
ఖర్మ రా బాబు అనుకుంటూ గబగబా అడుగులు వేయ సాగాడు . గబా గబా మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు రవి . పది మెట్లు ఎక్కగానే ఆయాసం వస్తున్నట్లు అనిపించింది . అలాగే మరొక పది మెట్లు ఎక్కాడు. ఆయాసం ఎక్కువయింది . అప్పటికి మెట్లు అన్నీ ఎక్కాడు . అమ్మయ్య అనుకుని ఒక్క నిముషం , కాదు అర నిముషం సేద తీర్చుకుని మళ్ళా సూటుకేసే తీసుకున్నాడు . ఈసారి సూటుకేసే ఇంకా ఎక్కువ బరువు అనిపించింది. ఈ ఉన్న ఆయాసానికి సూటుకేసే మోసే ఓపిక కూడా లేదనిపించింది . ఆ సూటుకేసే తీసుకుని అలాగే మెట్లు దిగి బోగీ కోసం వెదికాడు రవి. రెండు బోగీలు దాటినా తన బోగీ కనిపించలేదు. ఎక్కడ ట్రైన్ బయలుదేరుతుందోనని టెన్షన్ మరొకపక్క. నాలుగు బోగీలు దాటాక , TC కనిపిస్తే అడిగాడు AC బోగీ ఎక్కడ అని.
అప్పటికే రవి కింద మీద అవుతున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి తడిసిపోయాడు. సూటుకేసే బరువు చెయ్యి లాగేస్తోంది. తన అవస్థ అవతారం ఒక సారి తేరిపారా చూసి TC వెంటనే జవాబిచ్చాడు ,
అయ్యో సార్, ఇటుఎందుకు వచ్చారండి, ఆ బ్రిడ్జి నుండి రెండో బోగీ నే అంటే వెతుక్కుంటూ వచ్చాను సార్ చెప్పాడు రవి అతి కష్టం మీద రొప్పుకుంటూ . రవికి ప్రాణం పోతుందేమో అన్నంత ఇబ్బంది గా ఉంది.
సార్, మీరు బ్రిడ్జి కి ఇటు వైపుకు వచ్చారు, AC బోగీ బ్రిడ్జి కి అటువైపు ఉంది సార్ త్వరగా వెళ్ళండి, ఇంక సిగ్నల్ ఇస్తాడు అన్నాడు TC .
తన వల్లకాదు ఈ ట్రైన్ ఎక్కడం అనిపించింది రవి కి.
కానీ ప్రాణం బిగబట్టుకుని అలాగే అడుగులు ముందుకు వేసాడు . ఈసారి ఆరు బోగీలు దాటితే గానీ తాను ఎక్కాల్సిన AC బోగీ రాదు , అనుకుని ముందుకు సాగాడు రవి.
మొత్తం మీద తన బోగీకి చేరుకొని , బోగీ ఎదురుగ నిలబడ్డాడు రొప్పుకుంటూ.
గొంతు ఎండిపోతోంది . నాలిక కూడా ఎండిపోయి పిడచ గట్టుకు పోయింది.
పక్కనే ఒక కుర్రాడు లోపలికి వెళ్ళండి సార్ అన్నాడు. తాను ఆయాస పడుతూనే అతనివైపు చూసాడు. రవికి నోటా మాట రావడం లేదు.
సూటుకేసే లోపల పెట్టమంటారా అడిగాడు ఆ కుర్రాడు.
అలాగే అని సైగ చేసాడు రవి.
ఆ అబ్బాయి లోపల జస్ట్ ఎంట్రన్స్ లో పెట్టి చెయ్యి అందించాడు రవికి.
థాంక్స్ చెప్పడానికి కూడా మాట రావటం లేదు రవికి , ఒకటే ఆయాసం.
తలుపు నెట్టుకుని బోగీ లోపలకు వెళ్ళాడు రవి.
పాపం ఆ కుర్రాడే సూటుకేసే లోపలికి తెచ్చాడు . తన ఇబ్బంది చూసి అక్కడ అన్నవాళ్ళందరూ ఖంగారు పడ్డారు.
సార్ వాటర్ ఇమ్మంటారా అడిగాడు ఒకతను
ఓ అరగ్లాసు వాటర్ ఇచ్చాడు . వాటర్ తాగినా సర్దుకోలేదు.
ఏంచెయ్యాలో అర్ధం కావటం లేదు రవికి. ఊపిరి గట్టిగా పీల్చీ, పీల్చీ మెడమీద నరాలు, వీపు ఒకటే నెప్పి. తన చెయ్యి వెనక్కి పెట్టి వీపు నొక్కుకో సాగాడు రవి.
వీపు నొక్కమంటారా సార్ అని వీపు మీద చెయ్యి వేసి నెమ్మదిగా రుద్ద సాగాడు ఒక కుర్రాడు. అందరూ పాపం ఎదో సహాయం చేద్దామని తపన పడుతున్నారు. చేస్తున్నారు కూడా. మానవత్వం ఇంకా మిగిలి ఉంది అంటే నిజమే అనిపిస్తోంది.
ఇంతలో ట్రైన్ కదిలింది.
అయ్యో పిల్లకు అంజలికి పెళ్లి చెయ్యాలి. ఇంకా ఎక్కడా సంబంధాలు కూడా చూడలేదు, చిన్నపిల్ల కదా అని.
తనకేమో ప్రాణం మీదకు వచ్చేటట్లు ఉంది. ఇప్పుడు గనక నాకు ఈ ఆయాసం తోనే ఇక్కడ ప్రాణం మీదకు వస్తే ఏ ఆసుపత్రి కి వెళ్ళాలి, ఇంటికి ఎవరు చెప్తారు. ఒకవేళ ఇక్కడే ప్రాణం పోతే ఇంటికి ఎవరు చెప్తారు , ఆ పిల్లకు పెళ్లి చెయ్యడం ఎలా . తన భార్య సుజాత ఒక్కతే చేయగలదా.
ఈ ఆలోచనల నుండి బయటకు వచ్చి అపుడు కూర్చున్నాడు రవి.
కూర్చుంటే ఆయాసం ఇంకా ఎక్కువ అవుతోంది.
అప్పుడు గుర్తొచ్చింది రవికి, ఆయాసం వచ్చినపుడు ఖంగారు పడవధ్ధు , ప్రశాంతం గ కూర్చుని నెమ్మదిగా ఊపిరి పీల్చడానికి ట్రై చెయ్యాలి అని డాక్టర్ చెప్పాడు. అల్లాగే ఒక్క ఐదు నిముషాలు ఏమి ఆలోచించ కుండా కూర్చున్నాడు రవి .
పాపం చుట్టూ పక్కల వాళ్ళు ఆ AC బోగీ లో కూడా విసరడం మొదలు పెట్టారు.
ఇప్పుడు ప్రాణం కొంచం స్థిమిత పడింది.
మళ్ళా కాసిని నీళ్లు తాగి ఇంహేల్లెర్ కోసం వెదక సాగాడు రవి.
సుజాత టాబ్లెట్ బాక్స్ పెట్టింది. కానీ ఇంహేల్లెర్ ఎప్పుడు తన హ్యాండ్ బాగ్ లో ఉంటుంది. ఇపుడు ప్రయాణం లో హ్యాండ్ బాగ్ ఎందుకులే అని తేలేదు. ఇంహీలేర్ అందులో ఉండిపోయింది.
చేసేది లేక కాస్త ఊపిరి అందేవరకు కూర్చుని , నెమ్మదిగా గాలి పీల్చి , వదలటం , మళ్ళా నెమ్మదిగా పీల్చటం చేయ్యడానికి ప్రయత్నించాడు. కాస్త ఫ్రీ అయినతర్వాత అక్కడ ఉన్న అందరికీ వాళ్ళను ఖంగారు పెట్టినందుకు సారీ చెప్పి, వాళ్ళు తనను ఆడుకుని సేవలు చేసినందుకు థాంక్స్ చెప్పి సూటుకేసే తీసుకుని తన సీట్ దగ్గరకు వెళ్ళాడు రవి.
తనకు హెల్ప్ చేసిన కుర్రాడికి కూడా థాంక్స్ చెప్పాడు రవి.
ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ అడిగాడు ఆ పిల్లాడు
బాగానే ఉంది బాబు , ఫరవాలేదు స్థిమిత పడింది చె.ప్పాడు రవి.
మీతో ఎవరూ రాలేదా అంకుల్ అడిగాడు ఆ కుర్రాడు.
లేదు బాబు ఆఫీస్ పనిమీద వెళ్తున్నాను చెప్పాడు రవి.
ఈలోపు ఫోన్ మోగింది. గోపాల్ ఫోన్. చూస్తే అప్పటికే నాలుగు మిస్సుడు కాల్స్ ఉన్నాయి.
ఏంటి సార్ ట్రైన్ ఎక్కారా.. అడిగాడు గోపాల్.
ఆ ఎక్కాను అని చెప్పి జరిగినదంతా చెప్పాడు రవి .
కాసేపటికే తన దగ్గరకు వచ్చాడు గోపాల్ ఎలా ఉంది సార్ అంటూ.
పరవాలేదు అన్నాడు రవి.
కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు గోపాల్.
అప్పటికే మూడు కాల్స్ చేసింది సుజాత.
తనకి ఫోన్ చేసి చెప్పాడు ట్రైన్ ఎక్కానని. కానీ తనకి చెప్పలేదు ఇలా ఆయాసం తో ఇబ్బంది పడ్డానని. తాను ప్రత్యేకం గా అడిగింది కూడా , ఏమయినా ఆయాసం వచ్చిందా అని.
లేదు . అని చెప్పాడు. నిజం చెప్పలేదు. నిజమ్ చెబితే తాను ఈ రెండు రోజులూ ఇక నిద్ర కూడా పోదు. వెళ్ళాక వివరంగా చెప్పొచ్చులే అనుకున్నాడు.
ఈ లోపు TC వచ్చాడు టికెట్ చెకింగ్ కి. గుర్తుపట్టి అడిగాడు , ఎం సార్ క్షేమంగా అందుకున్నారా బోగీ అన్నాడు నవ్వుతూ.
ఆ ఆ ...అన్నాడు ముక్తసరి గా రవి.
మళ్ళీ ఆలోచనలో పడ్డాడు రవి.
పరిస్థితి ఇలా ఉంటె ఏమి చెయ్యడం. ఇంకా నాలుగు సంవత్సరాల సర్వీస్ ఉంది. రిటైర్ అయ్యేలోగా అంజలికి పెళ్లి చెయ్యాలి . అరుణ పెద్ద కూతురు దూరంగా ఎక్కడో అమెరికా లో ఉంది. తానూ చదువుకుందన్న మాటే గాని అక్కడ ఉద్యోగం చెయ్యడం కష్టం.
సుజాతకు ఎప్పుడూ నా ఆలోచనే .. పూర్తి గా ఆలోచనలో మునిగిపోయాడు రవి. మాది చిన్న ప్రపంచం . భగవంతుడిదయ వలన డబ్బుకు ఏ లోటు లేదు . కానీ నా ఆరోగ్యం అదీ ఈ ఆయాసం ఒక్కటీ చాలా ఇబ్బంది పెడుతోంది.
ఈరోజు వచ్చిన పరిస్థితి మరెప్పుడూ రాకూడదు అనుకున్నాడు రవి . మద్రాస్ లో ఆఫీస్ పని ముగియ గానే వెంటనే డాక్టర్ కు చూపించాలి అనుకున్నాడు రవి . సుజాత చెబుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఆఫీస్ పనేనా . కొంచం మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి, పట్టించుకోండి అంటూ. కానీ తనే నిర్లక్ష్యం చేసాడు. అదేంటో తెలీదు ఆఫీస్ పని ఏదయినా పెండింగ్ ఉంది అంటే అది పూర్తయ్యేవరకు నిద్రపోడు. అంటే ఆ పని మీదే ఉంటాడు. వేరే ఏ విషయాలు పట్టించుకోడు. తానేకాదు , చాలా మంది ఉద్యోగస్తులు ఇలానే పనిచేస్తున్నారు. తానూ అదే చేసాడు. ముప్పై ఏళ్ళ ఈ ఉద్యోగపర్వం లో వెనక్కి తిరిగి చూసుకుంటే , ఆరోగ్యం పాడుచేసుకుని ఆయాస పడటం తప్ప ఏమీ కనబడలేదు అనుకుంటూ బలవంతంగా నిద్ర పోవటానికి ప్రయత్నించాడు రవి, రేపు ఆఫీస్ లో చాలా పని ఉంటుంది అనుకుంటూ .
బాబు ఇక్కడే ఆపు ... అంటూ ఆటో రిక్షా అబ్బాయికి చెప్పాడు తన ఇల్లు చూపిస్తూ, మద్రాస్ నుంచి వచ్చిన రవి.
ఆటో అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి , నెమ్మదిగా ఇంటి దగ్గరకు వచ్చాడు రవి. ఉదయం ఐదు గంటలకే తన ఊరు చేరాడు , రైట్ టైం కె వచ్చింది రైలు . అంజలీ ..పిలిచాడు కాలింగ్ బెల్ నొక్కుతూ.
వస్తున్నా అంటూ తలుపు తీసింది సుజాత కళ్ళునలుపు కుంటూ .
మీరా , రండి అంది నవ్వుతూ లోపలికి వెళ్ళింది.
రావి కూడా లోపలికి వచ్చాడు.
అయినా కాలింగ్ బెల్ నొక్కుతూ అంజలీ అని పిలుస్తారేంటండి ..అంది సుజాత .
ఏదోలేవే ఎవరో ఒకరు తలుపు తీసారుగా అన్నాడు రవి సూటుకేసే పక్కన పెడుతూ.
...
మేలు చేసిన రైలు ప్రయాణం

మేలు చేసిన రైలు ప్రయాణం; ఎం. వి. సత్యప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి