అమ్మా నాన్న...;-- సుమ

 అమ్మ ప్రేమ పారదర్శకం 
నాన్న ప్రేమ గుంభనం !
అమ్మది ఆప్తవాక్యం 
నాన్నది గుప్తధనం !
అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ 
నాన్న ప్రేమ లో లోతెక్కువ !
అమ్మ జన్మ దాత 
నాన్న జీవన దాత !
అమ్మ పెరట్లో తులసి గూట్లో 
దీపానికి ప్రతీక !
నాన్న వికాసాన్ని వెదజల్లే
 వీధి గడప దీపానికి ప్రతీక!
అడుగులు తానై ... మార్గదర్శకం చూపుతూ ... 
పిల్లల అభివృద్ధి లో ఆనందాన్ని చూసుకునే 
తండ్రి ప్రేమ వెలకట్టలేని అమృతం !
కామెంట్‌లు