అవంతి రాజ్యాన్ని శూరసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అ రాజవనంలో తోటమాలితో కలసి పూతోట పరిశీలిస్తున్న సమయంలో, అవంతి రాజ్యం వేగు వచ్చి' మహారాజవారికి జయమగుగాక మనసైనికబలం ఐదువందలమంది సైనికులు ఉన్నారని తెలిసిన అమరావతి రాజు వక్రసేనుడు,తన వేయి మంది సైన్యంతో మనపై యుధ్ధనికి రావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మన సైన్యం సంఖ్య నిర్ధారించు కోవడానికి రేపు వారి ఇద్దరు వేగులు మధ్యాహాన్న సమయంలో మన రాజ్య పొలిమేరలలోని పూటకూళ్ళ అవ్వ ఇంటికి భోజనానికి రాబోతున్నారు ' అన్నాడు.
' ఇప్పుడు ఎలా మంత్రికూడా సమయానికి అందుబాటులోలేరే .అన్నాడురాజు.'ప్రభు నాదొక సలహ ' అన్నాడు తోటమాలి .
' ఏమిటి అది' అన్నాడు రాజుగారు. తన పధకం ఏమిటో వివరించాడు తోటమాలి.
' భేష్ బాగుంది అలానే కానివ్వు' అన్నాడురాజు.మరుదినం నగరపొలిమేరలలోని పూటకూళ్ళ అవ్వను కలసి ఏంచేయాలో వివరించిన తోటమాలి పెద్దచెట్టు చాటున చేరి వేగులకొరకు ఎదురుచూడ సాగాడు.
కొంతసేపటికి ఇద్దరు వ్యక్తులు గుర్రాలపై పూటకూళ్ళ అవ్వ ఇంటికి భోజనానికి వచ్చారు.తనకు కావలసిన వాళ్ళు వీళ్ళేనని గ్రహించిన తోటమాలి వారితో పాటు భోజనానికి కూర్చున్నాడు.' ఏమిటో విషేషం రాజుగారి వంటమనిషి మాఇంటి భోజనానికి వచ్చారే ' అన్నది తోటమాలిని చూసిన అవ్వ.
' అవ్వా మెతుకు మిగల్చకండా మాసైనికులు వడ్డింది మోత్తం తిన్నారు. మిగిలిన నావంట సహాయకులు మాకోరకు మళ్ళి వంట చేయబోతున్నారు, ఆకలికి ఉండలేక నేను ఇలా వచ్చాను ' అన్నాడు వంటవాని వేషంలోని తోటమాలి .
' నాయనా నాకు అర్ధంకాని విషయం ఏమిటంటే ,మా అల్లుడి గారి అరటి తోటలనుండి రోజు ఆరు వేల అరటి ఆకులు రాజుగారి దివాణాకు వెళతాయి, మన కోటలో రెండు వేలమంది సైనికులు ఉన్నా, లోకానికి మనరాజ్యంలో ఐదు వందల మంది సైనికులు ఉన్నట్లు ప్రచారం చేసారు ఎందుకు చేసినట్లు ' అన్నది అవ్వ .
' అవ్వా అది పెద్దరహస్యం మనం ఒకరిపై దాడి చేస్తే రాజ్యకాంక్షతో దాడి చేసాం అంటారు. అదే మరొకరు మనవద్ద తక్కువ సైన్యం ఉందని
ధైర్యంగా దాడిచేసారనుకో మన సైన్యం రెండు వేల మందితోపాటు, కత్తిసాములో శిక్షణ పొందిన మనరాజథాని యువకులు వేయి మంది కలిస్తేమొత్తం మూడువేలమంది,మన సైన్యం ఐదువందలే అని నమ్మి మనపై దాడికి వచ్చిన వాళ్ళను చిత్తుగా ఓడించవచ్చు, వాళ్ళ రాజ్యాన్నికూడా మనం స్వాధీనం చేసు కోవచ్చు , ఇవన్ని రాజకీయ ఎత్తుగడలు. ఎవరు మనపై దాడికి వచ్చినా వారు మన చేతిలో చిత్తుగా ఓడిపోయి, తమరాజ్యాన్నికూడా కోల్పోతారు ' అన్నాడు మారువేషంలోని తోటమాలి.
అతని మాటలు విన్న వేగులు తమరాజ్యం చేరి తమరాజుకు రహస్యంగా విషయం వివరించారు.యుధ్ధ ప్రయత్నం విరమించుకున్నాడు వక్రసేనుడు. తోటమాలిని తన సలహాదారులలో ఒకడుగా నియమించుకుని,తెలివిగా యుధ్ధం ఆపిన తోటమాలిని ఘనంగా సత్కరించాడు శూరసేనుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి