'అద్భుత సమయం";-నలిగల రాధికా రత్న.
కోకిల రాగాలతో 
ప్రకృతి పరవశించే
తీయని వలపు పులకింతల 
మధుమాసం 
వసంతాన్ని స్వాగతించే....!!

శిశిరంలో 
మోడువారిన చెట్లు 
వసంతుడి పిలుపుతో 
పచ్చని అందాలతో ‌‌విరబూస్తూ
చల్లని ముచ్చట్లతో
పలకరిస్తున్నాయి...!!

పచ్చని పట్టు తివాచీ 
పరిచినట్టున్న లోయలు,
పాల కడలిని తలపించే 
మంచు మేఘాలు,
పసిడి రంగులో మెరిసే
పచ్చని కొండలు
చిక్కని హరితారణ్యాలు
ఎటు చూసినా 
ప్రకృతి సోయాగాలతో అలరారే
వసంత శుభోదయం....!!

కరోనా కట్టడితో 
ఇంటికే పరిమితమైనా...
వసంత సోయగంతో
కొత్తగా రెక్కలు వచ్చినట్లు 
చల్లని గాలిని ఆస్వాదిస్తూ
పచ్చని  అందాల్ని 
కళ్ళు విప్పార్చుకుని చూస్తూ
హాయిగా ప్రకృతి ఒడిలో
జనావళి సేద తీరే
"అద్భుత సమయం"
వసంతాగమనం...!!


కామెంట్‌లు