" లోకమాన్య" హిట్లర్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 చీకటి నరాల్లో పారిన
రక్తం ప్రళయ గీతాన్ని 
పాడినదేమో....
కుట్రలు పన్నిన
క్రూరత్వం కన్నీటి అలల
సుడిగుండాలను 
కోరినదేమో....
గొప్ప అన్న గర్వం 
ప్రాణాలు తీసే
పైశాచికానికి పురుడు 
పోసినదేమో....
మదంతో మలినమైన
మనసు మానవత్వాన్ని
మొత్తంగా 
మరిచినదేమో....
తూటాల మాట 
మితిమీరి శాసనాల 
బాట పట్టినదేమో....
సైనికుడిగా ఎదిగి,
నాయకుడిగా వెలిగిన
దిక్కుల నేలిన 
డిక్టేటర్ ను...
దిక్కులేని చావుకు
ఉసిగొల్పినదేమో...


కామెంట్‌లు