చుక్కలు (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చుక్కలండి చుక్కలు 
నింగిలోన చుక్కలు 
ఆకాశపు వలలోన 
చిక్కుకున్న చేపలు 
ముత్యాల ముగ్గులు 
లేత మల్లె మొగ్గలు 
నింగిలోన దేవతలు
చల్లిరేమొ మల్లెలు 
నాకలోక వాసులు
వెలిగించిన దివ్వెలు
ఒకచోట గుంపుగా 
ఒక చోట ఒంటరిగా
లెక్కబెట్టలేనన్ని 
అందాల చుక్కలు !!

కామెంట్‌లు