సంతానం! అచ్యుతుని రాజ్యశ్రీ

 లతకి పెళ్ళి అయి చాలా రోజులు ఐనా పిల్లలు పుట్టకపోవటంతో ఓతాంత్రికుడుని  సంప్రదించింది.అక్కడ ఓపెద్ద క్యూ! తన వంతు రాగానే లత అతని కి  వంగి నమస్కరించింది.ఆమెను ఆశీర్వదిస్తున్నట్లుగా  గాల్లో చేయితిప్పి  ఆపై ఆమె అరచేతిలో విభూతి చల్లాడు."ఇది నోటిలో వేసుకొని మింగు.చెయ్యి బాగా నాకాలి.విభూది కన్పడరాదు"అతని ఆదేశంపై  తు.చ.తప్పకుండా ఆచరించింది లత!"సామీ!పెళ్ళి అయి ఆరేళ్లు. పిల్లపాపాలేరు"అని ఏడ్పు మొదలెట్టింది. ఆమెను ఓదారుస్తూనే ఓపసుపురుమాలా పవిత్ర జలం చేతిలోకి తీసుకున్నాడు. "ఈనీటిలో చెయ్యి బాగా కడిగి  ఎదురుగా ఉన్న ఆఅమ్మ విగ్రహంకి మొక్కు..ఆ..ఆతడిచేతిని ఈరుమాలాతో తుడుచుకో!" అంతాచూస్తుండగా పసుపు వన్నె దస్తీ ఎర్రరంగులో కి మారింది. "ఓ అమ్మాయి!నీపై ఏదో ప్రేతాత్మ  ఆవహించింది.నీకు  ఓమంత్రించిన ఉంగరం ఇస్తాను."అని ఓదారంకట్టిన  ఉంగరం ఇచ్చి దాని రెండో కొసని ఓకర్రకి కట్టాడు. ఆదారంకి వెలుగుతున్న ప్రమిదను చూపాడు.వింత ఏమంటే దారంకాలి బూడిద ఐంది కానీ ఉంగరం అలా గాల్లో వేలాడుతోంది.ఆఉంగరాన్ని స్వయంగా లత వేలికి తొడిగాడు.చెవిలో చెప్పాడు"రేపు అమావాస్య!సరిగ్గా రాత్రి 9గంటలకి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా నాదగ్గరకు రా! సంతాన యోగం కలుగుతుంది. "పిచ్చి అమాయకపు లత భర్త కి చెప్పకుండా  ఇంట్లోంచి బైట పడి మంత్రగాడి కుటీరం వైపు వడివడిగా అడుగులేయసాగింది.భర్త  వెంటనే లేచి నిశబ్దం గా  లతను అనుసరించాడు.మంత్రగాడి గుడారంలో నించి కెవ్ మంటూ కేకలు ఏడ్పువినపడటంతో కర్రతో సాగాడు లత మగడు."కాపాడండీ!ఓ అన్నా!నీకాల్మొక్కుతా"లత ఏడుస్తూ ఉంటే  వాడు ఆమె చీరలాగసాగాడు.అంతే ఆవేశం ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె భర్త  వాడి చేతులపై చావబాదసాగాడు."చచ్చానురా దేవుడా"అని  కుప్పకూలిపోయిన వాడిని బాగా ఉతికి తాడు తో కట్టి పోలీసు స్టేషన్ కి లాక్కుని పోయాడు. అక్కడ వాడు తన ట్రిక్కులు అన్నీ బైట పెట్టాడు.మంత్ర తంత్రాలపేరుతో  వాడు చేసే జిమ్మిక్కులు అన్నీ సైన్స్ కి సంబంధించినవి.చాక్ పీస్ పొడిని బియ్యపు గంజిలో కలిపి చిన్న చిన్న గోలీలు చేశాడు. ఓగోలీని తన చేతి వేళ్ళ మధ్య బాగా నలిపితే విభూది లాగా లత అరచేతిలో పడింది. పసుపు నీటిలో రుమాలు  బాగా తడిపిఎండబెట్టాలి.పవిత్ర జలంపేరుతో ఆమెని చెయ్యి కడగమన్నాడు. దస్తీ తో తుడుచుకోగానే అది ఎర్రరంగులో కి మారింది  రసాయనిక చర్యవల్ల! ఓతేలికైన ఉంగరంని దారంతో కట్టాడు.ఆదారంని పటికద్రావణంలో ముంచి ఎండబెట్టాడు.దారంని ఉంగరం కి చుట్టాడు.షోరే అనే ద్రావణంలో ముంచి ఎండబెట్టిన తాడు ఓకొసని ఉంగరంకి రెండో కొసని కర్రకి కట్టాడు. నిప్పు చూపటంతో పటికద్రావణంలో ముంచిఎండబెట్టి న ఆతాడు వల్ల  ఉంగరం గాల్లో తేలుతూ కనపడుతుంది. ఇవండీ ఆమోసగాడు దైవం పేరు తో చేసి న  ట్రిక్కులు!సంతానం కలుగుతుంది అనే నెపంతో  మహిళలను బలవంతంగా లొంగదీసుకుంటాడు.పైకి చెప్పుకోలేని ఆమె గర్భవతి ఐతే సాధువు ఇచ్చిన ఉంగరం పూజలు అని  మిగతా జనాలు నమ్ముతారు. అందుకే  డాక్టరు దగ్గరకు వెళ్లాలి కానీ దొంగ సన్యాసి దగ్గరకు పోతే మానం మర్యాద  పోతాయి.చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభంలేదు కదూ?🌹
కామెంట్‌లు