జాగృతి నానీలు పుస్తకం ఆవిష్కరణ


 \ సాయి వనం లో సాహిత్యం వాట్సాప్ గ్రూప్ వారు వ్రాసిన నానీల సంకలనం అడ్మిన్ శ్రీమతి కొడుపుగంటి సుజాత గారి సంపాదకత్వం, సంకల్పం తో సొంత ఖర్చులతో పుస్తకం ముద్రణ , ఆవిష్కరణ హైదరాబాద్ త్యాగరాయ గానసభ లో కళా సుబ్బారావు వేదికపైన 5 వ తేది ఉదయం కన్నుల పండుగ గా జరిగింది. ఈ సభ లో ముఖ్యఅతిథులు గా 
సుప్రసిద్ధ సినీగేయరచయిత మౌనశ్రీ మల్లిక్ గారు జాగృతి నానీలు పుస్తకం ఆవిష్కరణ చేసారు. తెలుగు కవితా వైభవం అధ్యక్షులు మేక రవీంద్ర గారు  అధ్యక్షతవహించిన ఈ సభలో గానసభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి, ప్రముఖ కవి డా. చక్రపాణి, ప్రముఖ రచయిత అవుసూరి వెంకటేశ్వరరావు, రేడియో వ్యాఖ్యా త శ్రీమతి తురుమెళ్ల కళ్యాణి, సాహిత్య కళా పీఠం అధ్యక్షులు చిక్కా రామదాసు పాల్గొన్నారు. అనంతరం కవులకు సుజాత గారి పర్యవేక్షణలో శాలువా, మొమెంటో, సన్మానపత్రం, డాలర్ తో  సన్మానం జరిగింది. కవులంతా అమ్మ అని పిలుచుకునే సుజాత గారికి చిరు సత్కారo పట్టు చీర, శాలువా తో జరిపి తమ ఆత్మీయత తెలుపుకున్నారు.వక్త లు మాట్లాడుతూ ఆచార్య గోపి గారి నానీలను పుస్తకంగా తీసుకొని రావడంతో సుజాతగారి సాహితీ సేవను కొనియాడారు
కామెంట్‌లు