సమాజంలో మనిషి ఎందుకు జీవిస్తున్నాడు? పెద్దలు మనిషిని సంఘజీవి అని ఎందుకు అన్నారు? ప్రత్యేకంగా ఒక వ్యక్తి వ్యక్తిగా కుటుంబం కుటుంబంగా ఉంటే వారికి కావలసిన సకల సౌకర్యాలు సమకూరవు. జీవించడానికి కావలసిన ప్రతి వస్తువును అతను సృష్టించలేడు అతను వ్యవసాయం చేస్తాడు తినడానికి బియ్యం, కూరలు దొరుకుతాయి. దానికి కావలసిన సరంజామా ఎలా సమకూరుతుంది ఒక వ్యాపారి ద్వారా పచారీ సరుకులు తెచ్చుకుంటాము. గానుగ ఆడించే అతని దగ్గరికి వెళ్లి నూనె కావలసినంత తెచ్చుకుంటాము. ఎవరు ఏ పని చేస్తారో అది ప్రతి కుటుంబానికి సహకరించిన మనిషి సమాజానికి, సమాజం మనిషికి సహాయపడటం కోసం ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సమాజంలో మంచివాడిగా బ్రతకడం కోసం ప్రతి వాడు ప్రయత్నం చేస్తాడు. కొంతమంది మంచి పేరు తెచ్చుకుంటారు ఇతని ప్రవర్తన వల్ల మన గ్రామానికి పేరు వచ్చింది అని మెచ్చుకుంటారు కూడా. అలాంటి జీవితాన్ని గడపడం కోసం వ్యక్తి తాపత్రయ పడతాడు.
తాను నిజాయితీగా జీవిస్తూ ఉన్నా తన పిల్లలు ఎలా ఉంటారు. ఇది ఆకర్షణకు లోనైయే లోకం వయసులో ఉన్నవాడు ప్రలోభాలకు లోను అవ్వక తప్పదు కొంతమంది నిగ్రహించుకునే వారు ఉంటారు. మరి కొంతమంది మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అని పట్టించుకోని వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబంలో ఒక్కడు తప్పు చేస్తూ జీవితాన్ని గడిపితే ఆ గ్రామ ప్రజలు ఏమంటారు అంత మంచి పేరు తెచ్చుకొని, తన కొడుకు ఎలాంటి తిరుగుబోతూ తాగుబోతూ అయ్యాడే అని బాధ పడతాడు. అలాంటి మంచి వాడికి ఇలాంటి తాగుబోతు జన్మించాడే అని గ్రామస్తులు ఆడిపోసుకుంటారు అందుకే వేమన చెరుకు గడతో పోలుస్తే అంత తీయదనాన్ని ఇచ్చేచెరుకు చివర వెన్ను పుడితే దానిలో ఉన్న తీపి మొత్తం నాశనం అయిపోతుంది కదా అని వివరిచారు వేమన.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి