*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0131)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*బ్రహ్మ రుద్రుని తో సతీదేవి ని పరిణయమాడమని అడగడం - విష్ణువు ఆమోదముతో వివాహం జరగడం *
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*నారదా, రుద్రుడు తన వద్దకు వచ్చిన మమ్మల్ని, సమస్తవదేవగణాలను చూచి, "శ్రీ హరీ, బ్రహ్మ మీరందరూ ఏపని కోసం నా వద్దకు వచ్చారు. మీ కోరిక లోకహితము కొరకు అయి వుంటుంది. నిస్సందేహంగా అడగండి. నేను నెరవేరుస్తాను" అన్నారు. అప్పుడు విష్ణువు చెప్పగా నేను పరమాత్మ హృదయం నుండి పుట్టిన రుద్రుని తో ఈ విధంగా చెప్పాను. వృషభధ్వజా! నీవు, విష్ణువు, నేను ముగ్గురమూ పరమాత్మ దివ్యవాంగముల నుండీ పుట్టాము. సృష్టి లో రాక్షసులు కూడా పుట్టారు.అలా పుట్టిన రాక్షసులలో కొంతమంది విష్ణువు చేతిలో, కొంతమంది నా చేతిలో, ఇంకొంతమంది మీ చేతిలో వధింప బడతారు. అయితే మీ భక్తపరాయణతను వాడుకుని కొంతమంది రాక్షసులు మీ నుండి వరాలు పొంది, మీ చేత కూడా సంహరింప బడరు. అటువంటి రాక్షసులు మీ పుత్రుల చేతనే వధింప బడతారు.*
*పరమేశ్వరుడవైన నీవే ఇదివరకు చెప్పినట్టు, అద్యా శ్రీ మహాలక్ష్మి అయిన ఉమాదేవి లక్ష్మి, సరస్వతి, పార్వతీ దేవి గా పుట్టింది. లక్ష్మి ని విష్ణువు, సరస్వతి ని నేను వివాహమాడాము. రుద్రుడవైన నీవు రాగరహితుడవై, నిర్గుణుడవై, నిరంతరం పరమేశ్వర ధ్యానం లో యోగిపుంగవుడిగా వుండడానికి ఇష్టపడతావు. మనము ముగ్గురము కూడా ఒకరికి ఒకరము పరస్పరము సహకారం చేసుకుంటూ పరమేశ్వరుని కోరికను పూర్తి చేయాలి కదా! అందువల్ల నీ చేత కూడా చంపబడని రాక్షసులను చంపడానికి నీవు నిరంతరము సృష్టి, పాలన, సంహారము పనులను చేస్తూ వుండాలి. అందుకని నీవు నీ కు యోగ్యమైన కన్యను వివాహం చేసుకోవలసింది, అని అడగడానికే మేము అందరమూ నీ దగ్గరకు వచ్చాము. మా ప్రార్థన మన్నించు, వృషభవాహనా!*
*విష్ణు, బ్రహ్మ, దేవగణములారా జగత్తు యొక్క కళ్యాణము కొరకు మీరు కోరిన కోరిక చాలా సమంజసంగా వుంది. కానీ, నేను ఎప్పుడూ తపస్సు లోనే వుంటాను. ఈ సంసారమునందు ఏమాత్రం మనసు లగ్నము కాదు నాకు. నిరంతర సంచారిని. భస్మం వళ్ళంతా ధరిస్తాను. భిక్షాటన చేస్తాను. నేను యోగి గానే ప్రసిద్ధి పొందాను. అది యోగిని, కదా! నేను ఎప్పుడూ నివృత్తి మార్గము లోనే వుంటాను. నాలో నేను రమిస్తూ వుంటాను. నేను ఆత్మ దర్శిని. ఏ వికారములు లేనివానిని. భోగములకు దూరంగా వుండే వాడిని. ఇటువంటి నాకు కామినితో ఏమి పని. విడమరచి చెప్పండి.*
*శ్లో: యో నివృత్తి సుమార్గస్థః స్వాత్మారామో నిరంజనః | అవధూత తనుర్జానీ స్వద్రష్టా కామవర్జితః||  అవికారీ హ్యాభోగీ చ సదా సుచిరమంగలః | తస్య ప్రయోజనంలోకే కామిన్యా కిం వదాధునా ||*
                             (శి.పు.రు.సం.స.ఖ.15/31,32)
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు