సర్వాంతర్యామి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,6302811961.

 దేవతలను కానీ, భగవంతుని గాని పూజించాలంటే  ప్రత్యేకమైన గుడికి వెళ్ళాలి. ఆ విగ్రహాలను చూస్తూ వాటిని మనసులో ప్రతిష్టించుకొని నమస్కారం చేసి పూజించాలి. ఇది మన పెద్దలు చెప్పే సిద్ధాంతం. తిరుపతి వెళ్లి  వేలమంది జనం కిక్కిరిసి వున్నా ఎంతో శ్రమపడి దైవ సన్నిధికి చేరి ఒక్క నమస్కారం చేసుకొని వస్తారు. అదే హైదరాబాదులో చాలా విశాలంగా ఆనందంగా  వ్యక్తిగతంగా పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు ఉన్న స్థలంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఎందుకు చూడడం లేదు? ప్రజలలో ఉన్న నమ్మకం,  విశ్వాసం ఈ మూఢనమ్మకాలకు, మూఢ విశ్వాసాలకు వేమన వ్యతిరేకి  ఆయన నమ్మడు ఎదుటివారిని నమ్మవద్దు అని హితబోధ చేస్తాడు. నిజమైన అన్వేషకుడు అయితే  ఆ గుళ్ళకు గోపురాలకు వెళ్లవలసిన అవసరం ఏముంటుంది? భగవంతుడు సర్వాంతర్యామి ఆయన ఎక్కడ లేడు. నీలోనే ఉన్నాడు కదా అహంబ్రహ్మాస్మి అన్న విషయం తెలిస్తే  మనలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన కోసం తపస్సు చేస్తాడు అది సాధించేంత వరకు నిద్రపోడు.  ప్రతి అణువులో ఉన్న దైవ స్వరూపాన్ని చూడడానికి  ప్రయత్నమే చేయలేడు మానవుడు. ప్రకృతిని గురించి  ఎంతో గొప్పగా చెప్పాడు వేమన.


కామెంట్‌లు