అన్ని రోజులలానే ఈ రోజు కూడా
ఏమీ అర్ధం కాకుండానే వ్యర్ధమై పోయింది...
కానీ నాకు ఎందుకో ఈ రోజు నచ్చలేదు,
కష్టాలు కన్నీళ్ళు శాశ్వతం కాదని
సద్దిచెప్పుకుంటూ సాగిపోయే నేను నేడు
జవాబు కోరి మౌనంగా ఆగిపోయాను...
మనసు సంద్రంలో అలల అలజడి ఎందుకో ఎక్కువైపోయింది...
ఆగక పరుగులు తీసే అడుగులలో ఆత్మవిశ్వాసం అలసిపోయింది...
సరిగ్గా అప్పుడే మెల్లగా ఏదో తెలియని
ఓ నిశబ్ధం నన్ను నల్లని మేఘమై చుట్టుముట్టింది...
నాకే తెలియని ఓ వింత ప్రపంచంలోకి
నన్ను పదమంటూ ముందుకు నెట్టింది...
అక్కడ ఎటు చూసినా చీకటే...
నాకు దిక్కుతోచడం లేదు
దారి ఎటు వైపో తెలియడం లేదు
దరిదాపులలో గమ్యం ఎక్కడా కనిపించడం లేదు....
అప్పుడు నాకు ఓ చిన్న చప్పుడు వినిపించింది...
ఎక్కడబ్బా!!! అంటూ వెతుకుతుండగా
నా కాలికి ఏదో అడ్డు తగిలింది...
తడిమి చూశా పుస్తకంలా అనిపించింది...
దాన్ని తెరవగానే అందులో నా పేరు కనిపించింది...
ఇంతలో గాలికి వేగంగా పేజీలు వాటికవే తిరగడం మొదలెట్టాయి...
నిజానికి అవి తెల్లని కాగితాలు మాత్రమే...
కానీ నాకు ప్రతి కాగితం ఓ కథనాన్ని వివరించింది
మొదటి పేజీలో....
చిన్నప్పుడు ఓ గాజు సీసాను పగలకొట్టగా,
అమ్మ ముందు చేసిన తప్పుని, నిర్భయంగా ఒప్పుకున్న నా ధైర్యం నాకు కనిపించింది...
ఇంకో పేజీలో...
నువ్వు ఈ లెక్కను చేయలేవు అన్న మా మాస్టారు మాటలను
తిప్పి కొట్టాలని లెక్కను చేసి చూపించిన తీరులో నా సమర్థత నాకు కనిపించింది...
మరో పేజీలో...
పరిస్థితుల ముందు ఓడిపోయి ఓటమిని ఒప్పుకోక తిరిగి ప్రయత్నాన్ని మళ్ళీ ప్రారంభించిన నాలో,
నా పైన నాకున్న నమ్మకం కనిపించింది...
నలుగురు వద్దన్న పనిని చేసినప్పుడు నాలోని మొండితనం...
ఎదుటివాని గర్వం ముందు తలదించని నా
ఆత్మాభిమానం తలపులకు రాగానే నాలో దాగిన తెగువ నాకు కనిపించింది...
ఇలా ఎన్నో ఎన్నెన్నో రంగురంగుల జ్ఞాపకాల గుర్తులు గుండెలకు నన్ను
హత్తుకొని దారి తప్పిన నాకు దారి చూపించి ఓదార్పును అందించాయి...
కనుల ఆకాశంలో కన్నీటి వర్షాన్ని కురిపించాయి...
బహుశా ఆ చిక్కని కన్నీటి చుక్కల వేడికేనేమో
నిశి నలుపు ఐసు ముక్కలా కరిగిపోయింది...
రవికి భాధ్యతను అప్పగించి ఆ వెండి వెన్నెల, రేయికి రాజీనామ చేసిపోయింది...
నేడు, నన్ను రేపు అన్న కాగితం పై చిరునవ్వుల సంతకాన్ని చేయమంటుంది....

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి