//రావయ్య రావయ్య ఓసారి రావయ్య//
రేపల్లె గోపయ్య
లీలలింక చాలయ్య
వెన్న కాస్త తినవయ్య
విన్నపాలు వినవయ్య....
//రావయ్య రావయ్య ఓసారి రావయ్య....//
ఏ వైపు చూసినా
నీ రూపే తోచెనయ....
ఉక్కపోతలో వున్నా
చలిగాలి వీచెనయ....
//రావయ్య రావయ్య ఓసారి రావయ్య//
నడిరేయిలోన
నిదురైన రాదయ...
కలలోన ఇలలోన
తలపంత నీదయ...
//రావయ్య రావయ్య ఓసారి రావయ్య//
మధురంగా మురళీ,
గానాన్ని చేసెనయ...
పురివిప్పి నెమలి,
నాట్యాన్ని ఆడెనయ...
సరదాల పరదాలు,
సరసంగా వీడవయ
చెంత చేరి ప్రియురాలి
చింత కాస్త తీర్చవయ...
//రావయ్య రావయ్య ఓ కొంటె కన్నయ్య//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి