పంతం;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 పంతం మంచిదే...
పంతం పట్టుదలను
పెంచుతుంది....
పంతం ఏకాగ్రతను
నేర్పుతుంది...
పంతం పరిష్కారాలను
చూపుతుంది...
పంతం గమ్యం దిశగా 
నడుపుతుంది...
పంతం చెడ్డదే....
పంతం ప్రవర్తనను
మారుస్తుంది...
పంతం పాపాలను
చేయిస్తుంది...
పంతం బంధాలను 
తుడిచేస్తుంది...
పంతం పరుల అంతానికి
దారి తీస్తుంది...
అందుకే...
పంతం పట్టి బిగువ లేక 
వీడటం కన్న…
పంతం పట్టి ప్రాణాలు 
తియ్యడం కన్న...
పట్టు విడుపులు 
కలిసిన పంతాలే 
అందరికీ మిన్న...



కామెంట్‌లు