చెప్పిన మాట వింటే వాళ్లు పిల్లలు ఎందుకు అవుతారు?
చీటికీమాటికీ తల్లిదండ్రులను విసిగిస్తూ, వారి సరదాలలో వారు మునిగితేలుతుంటారు. చదువు పైన అసలు శ్రద్ధ ఉండదు ఎంతసేపటికి ఆటలే.
రేపు ఉదయం స్కూలుకి ఎలా సెలవు పెట్టాలా అని ఏవో కాకమ్మ కబుర్లను ఆలోచించి పెట్టుకుని ఉంటారు. అమ్మా నాకు కడుపునొప్పి వచ్చింది అంటూ, అమ్మా నాకు జ్వరం వచ్చిందంటూ, వాళ్ళు చెప్పే కట్టు కథలని వింటుంటే భలే ముచ్చటేస్తుంది. ఆడపిల్లకి తండ్రి అంటే చాలా ఇష్టం, ప్రేమ ఉంటుంది అందుకే నాన్న చాటు చేరిపోయి రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళిపోతాను ఈరోజు మాత్రం వెళ్ళను నాన్నా అంటూ అమ్మకి నచ్చ జెప్పమని బ్రతిమాలుతుంటారు. మగ పిల్లలైతే అమ్మ కొంగులో దాక్కొని నాన్న ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడా అని తొంగి తొంగి చూస్తూ ఉంటారు. వారి పనులను సాధించుకోవడానికి వారు వేసే నాటకాలు అన్ని ఇన్ని కావు. నిజానికి పసిపిల్లలకు తెలిసినంత నాటకీయత మరెవ్వరికీ తెలియదు. వారి అమాయకత్వపు చూపులతో అందర్నీ ఇట్టే కట్టి పడేస్తారు.
చిన్నపిల్లలకు స్నానం చేయించాలన్నా, అన్నం తినిపించాలన్నా అదో పెద్ద తంతు. వాళ్లు మొండి పట్టు పట్టారంటే వీడరు. స్కూల్ కి వెళ్లి వచ్చి, నా పెన్సిల్ తీసేసుకున్నారమ్మా అంటూ పక్కవారి మీద చాడీలు కూడా చెప్తూ ఉంటారు. తల్లి కూడా వారిని సమర్థిస్తున్నట్టే మాట్లాడుతూ తెలివిగా వారిలో సత్ ప్రవర్తన అలవడేలా మంచి మంచి మాటలు చెప్తూ వారిని సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పిల్లలకు కుట్రలు, కుతంత్రాలు, కులాలు, మతాలు, కష్టాలు, కక్షలు గురించి అవగాహన ఉండదు అందుకే వారు అందరికీ ఆనందాన్ని పంచుతూ ఆనందంగా ఉంటారు. పిల్లలు ఉన్న లోగిళ్ళు దేవాలయాలతో సమానం అని నా భావన మరి మీరేమంటారు...?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి