అమర వీరుల త్యాగ ఫలం చాటే ఈ జెండా
తల్లి భారతికి వీరతిలకం దిద్దే త్రివర్ణ జెండా
శాంతి శౌర్యం త్యాగాల పుణ్యచరిత జెండా
దేహ మిచ్చిన దేశ సంరక్షణ కోస మీ జెండా
సస్య శ్యామల భరిత హరిత వర్ణం
విశ్వ శాంతికి మూలం ధవళ తేజం
కాషాయం త్యాగ నిరతి అమోఘం
సత్య అహింస ధర్మ ప్రబోధ ధ్వజం
నరనరం దేశభక్తి ఉరకలెత్తించే పతాకం
శత్రుమూక భరతం పట్టే రెపరెపల పతాకం
భారత మాతకు పుష్పాభిషేక మీ పతాకం
బానిస విముక్తి సంకేతం జాతీయ పతాకం
భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ జెండా
ప్రాంత భాష కులమతాల కతీతం జెండా
ఆత్మ గౌరవ నినాదమే ధ్యేయం ఈ జెండా
ఎవరెజెండా లెన్నున్నా అందరికండ ఈ జెండా
ఆబాల గోపాలానికి అండదండ ధ్వజం
జాతి సమైక్యతకు ప్రతిరూప మీ ధ్వజం
పేద ధనిక తర తమ భేదం లేని ధ్వజం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి