ఎన్నో బెదిరింపు చర్యల ఎదిరింపు పరంపరఎన్నెన్నో తిరగబడి బిగించిన ఉక్కు పిడికిళ్ళుమరెన్నో బలిదానాల నెత్తుటి మరకల పేజీలుఇంకెన్నో ఉవ్వెత్తున ఎగిసిపడే అగ్నికెరటాలు !ఆంగ్ల వలస పాలన విముక్తికై తూటాలకు ఎదురొడ్డిబానిస బంధన చేధనకై ఉరికంబానికి ఊయలలూగిఓ అహింసా వాదం మరో సాయుధ పోరు మార్గంకుల మత భాషా బేషజాలకు నిప్పంటించిన వైనం !లాల్ బాల్ పాల్ గాంధీ అంబేడ్కర్ సరోజినీభగత్ ఆజాద్ అల్లూరి నేతాజీ వీరనారి ఝాన్సీవేల వేల ఉద్యమ దివిటీల ఉత్ప్రేరక కారకంఅంచెలంచెల క్విట్ ఇండియా ఉద్యమ శిఖరం !కవి గాయక నాయక చైతన్య ప్రవాహంఆసేతు హిమాచల ఆబాలగోపాల మేకమైఎదఎదలో దేశభక్తి సమైక్య గీతాలాపనంనిద్రాణమైన జాతి యావత్తు జాగృతమైన వైనం !అమెరికా పౌరహక్కుల పోరాటానికి ప్రేరణగాఒకటా రెండా శత వసంతాల పోరాట చరిత్రభరతమాత చరణాల చెంత నెత్తుటి దీపారాధన !దేశమిచ్చిన దేహం కణకణం దేశానికే అర్పితంతల్లీ! నీ కోసం మరణం మా జన్మ ధన్యమంటూ..ధీరుల త్యాగ ఫలం రేపటి తరం ఆశల వారధి కోసంస్వేచ్ఛాసుమా లెదజల్లిన అమర వీరులకు వందనం !🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🙏🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪
ధీరుల త్యాగ ఫలం;- నాశబోయిన నరసింహ (నాన),చిట్యాల,నల్గొండ జిల్లా 8555010108
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి