చీకటి తలుపులను తెరుస్తూ, మూస్తూగమ్యం తెలియని ప్రయాణంలో ప్రవహిస్తూఉచితానుచిత లేపనాలు పూసుకుంటూమానని గాయాలను మోసుకుంటూ,మనిషితను నిలుచున్న కొమ్మనుతనే నరుక్కుంటున్నాడురెక్కలు తగిలించుకున్న కోరికలుఎందాకైనా ప్రయాణిస్తాయివింత కోరికల మనిషికి అంతులేని ఆశలెన్నోఅవి,అంతు చూసేవైనా సరేఎడారి నీటిలోఎంతవరకు తీరేను దాహంఆశల పల్లకిని మోస్తూఎన్ని కాలాలు బ్రతికేను మోహంసుడిగుండపు చక్రాలకిందశిథిలమై చిక్కుకున్నప్పుడుజీవితపు చివరి అంచును చూస్తూగొంతెత్తి అరవాలనిపిస్తుందిమూగబోయిన గొంతుతో నువ్వురాతిపాదాలకింద నలిగిన పువ్వుశ్రద్ధ నశిస్తుందిబుద్ది మందగిస్తుందిచలన రహిత దేహంలా తోస్తుందినియంత్రించే స్వతంత్రంనీ పాదాలను తాకుతుందితలలు నరికే నిజాలనునమిలేసే రాబందులుపీఠం కావాలని, వల వేస్తూబలిపీఠానికి ఆహ్వానిస్తుంటాయిజాగ్రత్త...______
అన్నీ ఉచితాలే ||;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి