పింగళి వెంకయ్య ||;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా
ఎందరో వీరుల త్యాగఫలంగా భరతావని యెద నిండా
తెలుగువాడి తేజము ఆకాశం నిండా ప్రవహించెను
తెల్లవాడినెదిరించిన సాహసాలు దిక్దిగంతాలు వ్యాపించెను

రక్త తర్పణం ఒకరు చేస్తే మార్గదర్శకంగా మరొకరు 
చెఱసాలలో కొలువై కొందరుంటే
ఆత్మ బలిదానాలు చేశారు మరికొందరు

పరిచయమక్కరలేని పేరు కలవాడు
పచ్చని సంతకమైన మహాత్ముని సమకాలీకుడు
గెలుపు శిఖరాన్ని అధిరోహించిన సమరయోధుడు
బహుగొప్ప కానుక భరతజాతికతడు 

కులమత భేదాలకతీతంగా
జాతి వ్యక్తిత్వానికి ప్రతీకగా మన జాతీయ జెండా
ఆ జెండాకే రూపకర్త పింగళి వెంకయ్య 
అతడిని స్మరించుకుందాం 
మన గౌరవాన్ని మనమే నిలుపుకుందాం.. 


______


కామెంట్‌లు