ఎగురవేద్దాం ! ఎగురవేద్దాం ! మువ్వన్నెల జెండా ! ;-"కవిరత్న" "సహస్ర కవి" పోలయ్య కూకట్లపల్లి--చరవాణి...9110784502
స్మరించుకుందాం ! స్మరించుకుందాం !
దేశభక్తిని...చైతన్యజ్వాలను రగిలించే  
వందేమాతరం...జనగణమనవంటి 
సుమధురగీతాల సృష్టికర్తలైన
బంకించంద్ర చటర్జీ...రవీంద్రనాథ్ ఠాగూర్ లను...
స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపే జాతీయపతాక 
రూపశిల్పి గాంధేయవాది శ్రీ పింగళి వెంకయ్యను...

తెలుపుదాం ! తెలుపుదాం ! విప్లవాభివందనాలు
అమర్ రహే అంటూ దిక్కులుపిక్కటిల్లేలా నినదిస్తూ 
పిన్నవయసులోనే దేశరక్షణ కోసం ప్రాణాలను 
తృణప్రాయంగా త్యాగంచేసి తల్లి భరతమాత 
నుదుట రక్తతిలకాన్ని దిద్దిన విప్లవవీరులైన 
ఆ భగత్ సింగ్...ఆ అల్లూరి సీతారామరాజులకు...

గుర్తుచేసుకుందాం ! గుర్తుచేసుకుందాం !
భారతమాత దాస్య శృంఖలాలను త్రెంచ
ఆంగ్లేయుల అకృత్యాల నెదిరించి జైళ్ళలో మ్రగ్గిన 
స్వాతంత్ర్య సమరయోధులు...జాతినేతలైన 
ఆ గాంధీజీ నెహ్రూ నేతాజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 
అటల్ బిహారీ వాజపేయి ఇందిర అబ్దుల్ కలాంలను...

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అత్యున్నతమైన 
రక్షణ కవచనం వంటి రాజ్యాంగాన్ని రచించిన 
ఆ అపర మేధావి అమరజీవి అంబేద్కర్ ను...

ఎగురవేద్దాం ! ఎగురవేద్దాం ! ఇంటింటా... 
మువ్వన్నెల జెండా ! మన ముచ్చటైన జెండా !



కామెంట్‌లు