భారత మాతకు జేజేలు,; -ఆర్. రంగ రాణి,జి.ప. ఉ.ప(బాలుర),మంచిర్యాల,9440348866.

 భారత మాతకు జేజేలు,
బంగరు భూమికి జేజేలు,
పిల్లలం మేం పిల్లలం,
భారతావని ఒడిలో మల్లెలం,
పౌరులం మేమంతా  పౌరులం,
భారతదేశ ప్రజాస్వామ్యంలో పౌరులం,
శిష్యులం మేం శిష్యులం 
మహాత్మాగాంధీకి శిష్యులం
తమ్ములం మేం తమ్ములం,
శుభాష్ బోస్ కు తమ్ములం,
వారసులం మేం వారసులం,
భగత్ సింగ్  కు వారసులం,
పిల్లలం మేం పిల్లలం,
చాచా నెహ్రూకు ఇష్టులం,
మరువం మేం మీ  త్యాగ ఫలం,
అనుభవిస్తున్నాం మేం ఇపుడు,
మీరిచ్చిన
స్వాతంత్య్ర ఫలం,
జరుపుకుందాం మనంమంతా 
వజ్రోత్సవాలు, మనసునిండా 
నింపుకొని ఆనందోత్సాహాలు,
జోహారు జోహారు అమర వీరులకు,
జోహారు జోహారు త్యాగధనులకు,
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు 🙏🌹.

కామెంట్‌లు